Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్..

15 July 2025

Cinema: మీరు సినిమాలకు కథలు రాస్తారా? రైటర్లుగా స్థిరపడాలనుకుంటున్నారా? మీకోసమే జీ రైటర్స్ రూమ్.. పూర్తి వివరాలు

15 July 2025

ఒకప్పుడు టీచర్.. స్టూడెంట్‍తో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు..

15 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Care Taker Retired Engineer Vijayawada,రిటైర్డ్ ఇంజనీర్ హత్య: 12 ఏళ్లకే లవ్ మ్యారేజ్, భర్త, పిల్లలను వదిలేసి మరో 2 పెళ్లిళ్లు.. మూడో మొగుడితో కలిసి ఇలా.. – vijayawada retired engineer ramarao murder case police details on care taker
ఆంధ్రప్రదేశ్

Care Taker Retired Engineer Vijayawada,రిటైర్డ్ ఇంజనీర్ హత్య: 12 ఏళ్లకే లవ్ మ్యారేజ్, భర్త, పిల్లలను వదిలేసి మరో 2 పెళ్లిళ్లు.. మూడో మొగుడితో కలిసి ఇలా.. – vijayawada retired engineer ramarao murder case police details on care taker

.By .15 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Care Taker Retired Engineer Vijayawada,రిటైర్డ్ ఇంజనీర్ హత్య: 12 ఏళ్లకే లవ్ మ్యారేజ్, భర్త, పిల్లలను వదిలేసి మరో 2 పెళ్లిళ్లు.. మూడో మొగుడితో కలిసి ఇలా.. – vijayawada retired engineer ramarao murder case police details on care taker
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Retired Engineer Murder by Care Taker Vijayawada: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామారావు ఇంట్లో పనిమనిషిగా ఉన్న అనూష, తన భర్త సాయంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనూష అలియాస్ పల్లపు మంగ గురించి పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసి వచ్చాయి.

విజయవాడ రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసు
విజయవాడ రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసు (ఫోటోలు– Samayam Telugu)

విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అనూష అనే పనిమనిషి.. రామారావు అనే రిటైర్డ్ ఇంజనీర్‌ను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో మాచవరం పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భర్త ఉపేంద్ర సాయంతో పనిమనిషి అనూష యజమాని అయిన రిటైర్డ్ ఇంజనీర్ రామారావును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా అనూష బ్యాక్ గ్రౌండ్ తనిఖీ చేసిన పోలీసులకు కఠోర వాస్తవాలు తెలిసి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

*28 ఏళ్ల యువకుడికి పార్టీలో పరిచయమైన 40 ఏళ్ల వివాహిత.. ఆ తర్వాతే అసలు కథ, పాపం పసివాడు!

అనూష స్వస్థలం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెం. అనూష అలియాస్ పల్లపు మంగకు 12వ ఏటనే పెళ్లి జరిగింది.12 ఏళ్లు వయసు ఉన్నప్పుడే అనూష, రమేష్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఐదేళ్ల కిందట అనూష.. భర్త రమేష్, పిల్లలను వదిలేసి విజయవాడకు వచ్చేసింది. అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ కొంతకాలం గడిపింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు అనూష మకాం మార్చింది. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో డేటింగ్ యాప్‌లో రాజా అనే వ్యక్తి అనూషకు పరిచయమయ్యాడు. దీంతో అనూష అలియాస్ పల్లపు మంగ.. రాజాను రెండో పెళ్లి చేసుకుంది. ఏడాది గడిచిన తర్వాత ఏం జరిగిందో ఏమో.. రాజాను కూడా అనూష వదిలేసింది.

Vijayawada Retired Engineer Murder: ఇంటి ఓనర్‌ను చంపిన పనిమనిషి

అయితే డేటింగ్ యాప్ ద్వారా మరో వ్యక్తి అనూషకు పరిచయం అయ్యాడు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తి డేటింగ్ యాప్‌లో అనూషకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే నెలాఖరులో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న రిటైర్డ్ ఇంజనీర్ రామారావు ఇంట్లో ఇటీవల కేర్ టేకర్‌గా చేరింది అనూష. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే రామారావు ఇంట్లో భారీగా డబ్బులు, నగలు ఉంటాయనే ఆలోచన వచ్చింది అనూషకు. ఆ ఆలోచనే క్రూరమైన పని చేసేలా చేసింది.

*యువతీ, యువకుడి మధ్య గొడవ పెట్టిన కుక్క.. రెండు వర్గాల మధ్య వివాదం..

రామారావును అడ్డు తొలగించుకుంటే భారీగా నగలు, డబ్బులు దక్కుతాయని మూడో భర్త అయిన ఉపేంద్రకు నచ్చజెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న రామారావును ఇద్దరూ కలిసి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మంచం మీద కారం చల్లారు. అనంతరం ఇంట్లో డబ్బులు, నగలు కోసం గాలించగా ఎలాంటివి లభించలేదు. దీంతో బీరువాలో ఉండే రూ.50000 తీసుకుని పరారయ్యారు. అయితే ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతికత సాయంతో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి