
ప్రతి ఒక్కరికి విమానం ఎక్కాలి, అందులో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. కానీ తమ ఆర్థిక, పరిస్థితులు, అధికంగా ఉండే విమాన టికెట్ల ధరల కారణంగా వారి కోరికలను అక్కడే వదిలేసుకుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఇండిగో విమానయాన సంస్థ ఒక ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకు ఫ్లైట్ జర్నీని అందించనుంది. ఇందులో భాగంగానే ఇండిగో సంస్థ తన ప్రయాణికుల కోసం ప్రత్యేక మాన్‌సూన్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో దేశీయ విమానయాన ప్రారంభ టిక్కెట్ ధరను రూ. 1,499కే అందించనుంది. ఇక విదేశాలకు ప్రయాణించే విమాన ప్రారంభ టిక్కెట్ ధరను రూ. 4,399 పేర్కొంది. తక్కువ ధరలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ ఆఫర్ ఒక సువర్ణావకాశమని ఇండిగో సంస్థ తెలిపింది
ఇండిగో మాన్‌సూన్ సేల్ వివరాలు..
ఈ ప్రత్యేక మాన్‌సూన్ సేల్ జూలై 15 నుండి ప్రారంభమై.. జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మాన్‌సూన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు జూలై 22 నుంచి సెప్టెంబర్ 21 మధ్య ప్రయాణాలు సాగించవచ్చు. అయితే ఇండిగో సంస్థ టిక్కెట్లతో పాటు మరిన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇందులో ప్రయాణికులు ఎక్స్ట్రా లెగ్‌రూమ్ సౌకర్యం కోసం ‘ఇండిగో స్ట్రెచ్’ను రూ. 9,999 నుండి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇండిగో ఇతర ఆఫర్లు కూడా చూడండి.
అంతేకాకుండా డొమెస్టిక్, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీ-పెయిడ్ ఎక్స్ట్రా లగేజీపై 50 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది.
దేశీయ విమానాల్లో ఎక్స్ట్రా లెగ్‌రూమ్ ఉన్న ఎక్స్ఎల్ సీట్లును రూ. 500 (అదనంగా) నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు అదనంగా, ఎంపిక మార్గాల్లో 6E ప్రైమ్, 6E సీట్ సేవలకు 30 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
ఈ మాన్‌సూన్ సేల్ ఆఫర్లను ఇండిగో విమానయాన సంస్థ అధికారిక వెబ్‌సైట్, లేదా మొబైల్ యాప్, టిక్కెట్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేల్‌తో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాన్ని ఇండిగో సంస్థ అందించనుంది.
మరిన్ని బిజినెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.