Vaibhav Suryavanshi: యువ క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనానికి తెరలేపిన భారత అండర్-19 యువ స్పిన్నర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. బెకన్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతోన్న తొలి యూత్ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేసిన వైభవ్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ స్పెషల్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన ఈ ఐపీఎల్ సెన్సేషన్.. బౌలింగ్‌లో టాప్ లేపాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైభవ్ తన ఖాతాలో రెండు కీలక వికెట్లు లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను కీలక సమయంలో పడగొట్టి భారత జట్టుకు ఆధిక్యం వచ్చేలా చేశాడు.
వైభవ్ అరుదైన రికార్డ్..
ఈ 14 ఏళ్ల టీమిండియా చిచ్చర పిడుగు బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో.. ఓ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులో ఓ యూత్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ సాధించి రికార్డు సృష్టించడం గమనార్హం. గతంలో ఈ రికార్డు కూడా ఓ భారతీయుడి పేరుతోనే ఉంది. భారత అండర్-19 క్రికెటర్ మనిషీ (15) తొలిసారి ఈ లిస్ట్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌తో మనిషీ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేయడం విశేషం.
ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి..
4వ రోజుకు చేరిన ఈ అండర్-19 తొలి యూత్ టెస్టులో ప్రస్తుతం భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా భారత్ 290 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ 56 పరుగులు, ఆయుష్ మాత్రే 32, మల్హోత్రా 63 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 540 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు 439 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ..
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే బౌలింగ్‌తో ఎలాంటి మాయజాలం చేస్తాడో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..