పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ధర్మపరుడిగా, బలవంతుడిగా, ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. “ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారు. ఈ అంశం నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకే ‘హరి హర వీరమల్లు’లో ‘మాట వినాలి’ అనే శక్తివంతమైన ఆలోచింపజేసే పాటను స్వరపరిచాము. ఈ పాట సారాంశం పవన్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఈ పాట ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసింది.” అని జ్యోతి కృష్ణ అన్నారు.
అదేవిధంగా, నటుడిగా ఎన్టీఆర్ గొప్ప ప్రదర్శనలు పౌరాణిక, జానపద చిత్రాల నుంచి వచ్చాయి. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. “ఎన్టీఆర్ తన శక్తిని ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా అద్భుతంగా నటించారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది, ‘హరి హర వీరమల్లు’లో పవన్ గారి కోసం విల్లు, బాణాన్ని రూపొందించాము. పవన్ కళ్యాణ్ శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు రూపొందించాం” అని జ్యోతి కృష్ణ వివరించారు. అలాగే తాను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని గ్రహించానని ఆయన అన్నారు. “కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నాను.” అని జ్యోతి కృష్ణ చెప్పారు.
మరో 10 రోజుల్లో..
The stage is set for a monumental clash of swords and spirits ⚔️🔥#HariHaraVeeraMallu is Coming to slay in 10 days 🦅🦅 #HHVMonJuly24th #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 @Manojdft… pic.twitter.com/yIq6Dtf93T
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..