చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హారర్ సినిమాగా ఇది అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద స్టార్ హీరోలు లేరు.. గొప్ప సన్నివేశాలు లేవు.. ఈ చిత్రాన్ని హ్యాండ్ హెల్డ్ కెమెరాతో చిత్రీకరించడం మరో విశేషం. కానీ ఈ సినిమా లక్షలాది మందిని భయపెట్టింది. ఆ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. కేటీ ఫెదర్‌స్టన్, మికా స్లాట్ నటించిన ఈ చిత్రాన్ని.. ఓరెన్ పీలే రచించి, దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు ఓరెన్ బెలికి ఇది మొదటి సినిమా. ఈ మూవీ మొత్తాన్ని ఆయన తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు. దర్శకత్వం నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. ఈ సినిమాలో అందరూ చిన్న చిన్న నటీనటులు నటించారు. అంతేకాదు చాలా వాస్తవికంగా ఈ సినిమాను తెరెక్కించారు ఆయన. పారానార్మల్ యాక్టివిటీ సినిమా మొత్తానికి కేవలం రూ.12 లక్షల ఖర్చు అయిందట. కానీ ఈ సినిమా క్లైమాక్స్ తిరిగి చిత్రీకరించడంతో బడ్జెట్ రూ.2 కోట్లకు చేరుకుందట. అలాంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించి 1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళితే.. ఒక కనిపించని దెయ్యం.. ఒక యువ జంటను ఎలా హింసిస్తుందనేది ఈ సినిమా కథ. చీకటిలో అడుగుల చప్పుడు, భయంకరమైన నిశ్శబ్దం… అన్నీ థ్రిల్లింగ్ హర్రర్ అనుభవాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. డేర్ ఉంటే.. భయపడము అనుకుంటే మీరు కూడా ఓ లుక్కేసేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనసూయను మోసం చేసి డబ్బు గుంజిన కేటుగాళ్లు
చిరులా.. నోరు జారిన నాగ్ రజినీ ఫ్యాన్స్ సీరియస్
ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా…
రూ.1000 కోట్లతో సినిమా తీస్తా !! శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాకవుతున్న ప్రొడ్యూసర్లు
కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అంటూ ట్రోలింగ్.. మోహన్ బాబు రియాక్షన్