చాలా మంది వాహనాలు టోల్‌గేట్ వద్దకు రాగానే ఫాస్టాగ్ పని చేయవు. ఫాస్ట్ ట్యాగ్ మీ కారు విండ్ స్క్రీన్ కు అతికించారా? లేదా అనేది నిర్ధారించుకోవాలి. మీరు హైవే టోల్ బూత్ లకు వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తున్నప్పుడు ఫాస్టాగ్ సరిగ్గా పని చేయకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి ఫాస్ట్‌ట్యాగ్‌లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చనున్నారు అధికారులు. ప్రభుత్వం అలాంటి నియమాన్ని రూపొందించింది. ఇటీవల విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వదులుగా ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లను బ్లాక్ లిస్ట్ చేయాలని నిర్ణయించింది.
సాధారణంగా వాహనదారులు తమ ఫాస్టాగ్ (FASTag)లను వాహన విండ్‌షీల్డ్‌లపై అతికించాల్సి ఉంటుంది. దీంతో టోల్‌ప్లాజాల వద్ద ఉన్న స్కానర్లు వాటిని స్కాన్ చేసేందుకు వీలుంటుంది. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను అతికించట్లేదని గుర్తించారు అధికారులు. టోల్ గేట్లు వచ్చినప్పుడు పర్సులో నుంచి తీసి చూపిస్తున్నారు. ఇలాంటి వాటినే ‘లూజ్ ఫాస్టాగ్’గా పిలుస్తారు. ఇలాంటి యూజర్ల వల్ల టోల్ పాస్ నిర్వహణ సమస్యగా మారుతోందని, ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. అంతేగాక, కొందరు టోలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Personality Test: మీ ముక్కు ఆకారం ఇలా ఉందా? మీరు ఎలాంటి వారో చెప్పేయవచ్చు!
ఇవి కూడా చదవండి
మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే, అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్ళవచ్చు. మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని మీ వాహనానికి సరిగ్గా అంటించకపోతే లేదా టోల్ గేట్ల వద్ద దానిని సరిగ్గా ఉపయోగించకపోతే అది బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు. అంతేకాదు.. ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను ప్రారంభించిన తర్వాత మీరు KYC ప్రక్రియను పూర్తి చేయకపోతే అది బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు. ఎప్పుడు కూడా మీ ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉందని నిర్ధారించుకోండి. దానిని మీ వాహనానికి సరిగ్గా అతికించి టోల్ గేటు వద్ద సరిగ్గా ఉపయోగించండి.
వాహన యజమానులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌లను విండ్‌స్క్రీన్‌పై సరిగ్గా అతికించకపోవడం వల్ల టోల్ బూత్‌ల వద్ద రద్దీ, తప్పు ఛార్జ్‌బ్యాక్‌లు, టోలింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలైన వాటి ద్వారా ఇది మొత్తం టోలింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో టోల్ బూత్‌ల వద్ద వాహనాలు ఆలస్యం అవుతున్నాయని, దీనివల్ల ఇతర హైవే వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని గమనించినట్లు NHAI ఒక ప్రకటనలో తెలిపింది.
FASTags ఎలా బ్లాక్ లిస్ట్ చేయబడతాయి?
లూజ్ అయిన FASTags గురించి నివేదించడానికి హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక ఇమెయిల్ IDని సృష్టించింది. టోల్ బూత్‌లలో లూజ్ అయిన FASTags కనిపించినప్పుడు కలెక్షన్ ఏజెన్సీలు, కన్సెషనరీలు వెంటనే ఆ ఇమెయిల్‌కు సమాచారం పంపాలని కోరారు. దీని ఆధారంగా అటువంటి FASTags బ్లాక్‌లిస్ట్ అవుతాయి.
FASTags ద్వారా మోసం ఎలా జరుగుతుంది?
వాహన రకాన్ని బట్టి ఫాస్ట్‌ట్యాగ్‌లు మారుతూ ఉంటాయి. పెద్ద వాహనాలకు వేర్వేరు ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాహనాలకు టోల్ రేటు ఎక్కువగా ఉంటుంది. చిన్న కార్లకు వేర్వేరు ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉంటాయి. అయితే పెద్ద వాహనాలు చిన్న వాహనాలకు జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. ఇది మోసానికి దారితీస్తుంది. అదేవిధంగా క్లోజ్డ్ లూప్ టోలింగ్ వ్యవస్థలో ఫాస్ట్‌ట్యాగ్‌లను వేర్వేరు వాహనాల మధ్య మార్చుకోవచ్చు. తద్వారా టోల్‌లు చెల్లించకుండా నివారించవచ్చు. ఇటువంటి కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.
అదేవిధంగా, బ్యాంకులు, FASTags జారీ చేసిన టోల్ ఆపరేటర్ల నుండి ఛార్జ్‌బ్యాక్ అభ్యర్థనలు పెరుగుతున్నాయి. అంటే, వాహన వర్గానికి తగినవి కాని FASTags ఉపయోగించినప్పుడు అది టోల్ ప్లాజా వద్ద గుర్తిస్తారు. అప్పుడు ఛార్జ్‌బ్యాక్ సమస్య తలెత్తుతుంది. FASTag, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ సరిపోలుతుందో లేదో తనిఖీ చేయడానికి సాంకేతికత ఉంది. అయితే, ప్రస్తుతం టోల్ ప్లాజాలలో ఉన్న స్కానర్లు ట్యాగ్ సమాచారాన్ని మాత్రమే గుర్తిస్తున్నాయి. ట్యాగ్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో సరిపోలుతుందో లేదో వారు చెక్ చేయడం లేదు.
ANPR టెక్నాలజీ
టోల్ బూత్‌లలో నంబర్ ప్లేట్‌లను గుర్తించడానికి ANPR టెక్నాలజీని అమలు చేశారు. అయితే, చాలా వాహనాలు ఇంకా ఈ కొత్త నంబర్ ప్లేట్‌లను ఏర్పాటు చేయలేదు. చాలా వాహనాలు, ANPR నంబర్ ప్లేట్‌లను కలిగి ఉన్నప్పటికీ, వాటిని కనిపించే ప్రదేశంలో ఉంచలేదు.
ఇది కూడా చదవండి: Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడెక్కడ అంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి