
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం సుని వంతెన సమీపంలో అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రయాణికులతో మువాని పట్టణం నుంచి బోక్తాకు బయల్దేరిన ఓ వాహనం సుని వంతెనకు సమీపంలోకి రాగానే అదుపుతప్పి వంతెనసై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాహనం నదిలో పడే సమయంలో ప్రయణికులు కాపాడమని కేకలు వేసినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నారు.
వాహనం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 8 మంది చనిపోగా మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ప్రాణాలతో రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. అయితే మరణించిన వారితో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారంతా బోక్తాకు చెందిన వారుగా సమాచారం అందుతోంది.
ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర సీఎం ధామి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ధామి ఆకాంక్షించారు.
जनपद पिथौरागढ़ के मुवानी क्षेत्र में वाहन के दुर्घटनाग्रस्त होने का अत्यंत दु:खद समाचार प्राप्त हुआ।
ईश्वर से प्रार्थना है कि दुर्घटना में दिवंगत हुए लोगों की आत्मा को श्रीचरणों में स्थान एवं शोक संतप्त परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। जिला प्रशासन को…
— Pushkar Singh Dhami (@pushkardhami) July 15, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.