ఓటీటీల్లో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. ఒక్కొరికీ ఒక్కొక్క జానర్ మూవీస్ నచ్చుతాయి. అయితే ఈ మధ్యన ఓటీటీలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందుకే ఓటీటీ సంస్థలు కూడా ఈ కేటగిరీ సినిమాలు, వెబ్ సిరీస్ లనే ఎక్కువగా ఆడియెన్స్ కు అందుబాటులోకి తీసకొస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా ఒక హారర్ థ్రిల్లర్ జానర్ కు చెందినది. ఇది ఒక నవల ఆధారంగా తెరకెక్కింది.ఇది ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లోనే అత్యంత భయంకరమైన హారర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ఇందులోని భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇక ఇందులోని ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాక్ ఖాయం. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి సుమారు 50-70 నిమిషాల నిడివితో ఉంటుంది. ఈ సిరీస్ కు ఐఎమ్ డీబీ ఏకంగా 8.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. హాలీవుడ్ దిగ్గజ రచయిత స్టీఫెన్ కింగ్ కూడా ఈ సిరీస్ ను చూసి ప్రశంసలు కురిపించారు.
ఈ హారర్ సిరీస్ రెండు టైమ్‌లైన్‌లలో (1992, 2018) సాగే ఒక హంటెడ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. 1992లో హ్యూ క్రెయిన్ , అతని భార్య ఒలివియా తమ ఐదుగురు పిల్లలు స్టీవెన్, షిర్లీ, థియోడోరా, లూక్, ఎలియనోర్ తో హిల్ హౌస్‌లోకి వెళతారు. అయితే ఆ ఇంట్లో వింతైన సంఘటనలు జరుగుతాయి. భయంకరమైన శబ్దాలు, దెయ్యాలు కన్పించడం, ఒలివియా వింత ప్రవర్తన ఆ ఫ్యామిలీని టెన్షన్ పెడతాయి. ఒక రోజు ఒలివియా తన పిల్లలకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ హ్యూ వారిని రక్షించి తనతో తీసుకుని పారిపోతాడు . ఒలివియా మాత్రం ఇంట్లోనే చనిపోతుంది. కానీ ఆ వివరాలు రహస్యంగా ఉంటాయి. ఇక 2018లో క్రెయిన్ తోబుట్టువులు పెద్దవారవుతారు. తిరిగి మళ్లీ ఆ హంటెడ్ హౌస్ కు వెళతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
ఈ సిరీస్ పేరు ‘The Haunting of Hill House’. 2018లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. భయంకరమైన సీన్లు ఉండడంతో ఈ సిరీస్ ను పిల్లలతో చూడకపోవడమే బెటర్
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి