దేశవ్యాప్తంగా ఉన్న యువతరం, భవిష్యత్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, ఒక మైలురాయి కార్యక్రమంగా జీ రైటర్స్ రూమ్ – ప్రారంభించినట్లు ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సగర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది ప్రతిభను అన్వేషించే ప్రయత్నం కంటే మించినది—’యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ బ్రాండ్ తాత్వికతతో ముడిపడిన ఒక సృజనాత్మక ఉద్యమం ఇది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ తన కంటెంట్ సమర్పణను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యం. తాజా దృక్పథాల కోసం డిమాండ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో, మూల కథ చెప్పే సామర్థ్యం , స్క్రీన్ రైటింగ్ అనే వృత్తిగత ప్రపంచం మధ్య అంతరం తగ్గించాలన్నది ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఎంపిక చేసిన రచయితలు ‘Z’పరిధిలోని విస్తృత స్థాయి టీవీ, డిజిటల్, ఫిల్మ్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు రూపొందించేందుకు ఈ ఈ కార్యక్రమం అవకాశం అందిస్తుంది.
‘Z’కి చెందిన కేంద్రీయ కంటెంట్, ప్రాంతీయ బృందాల దర్శకత్వంలో, భారతదేశపు వినోద ప్రకృతి దృశ్యంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలతో అనుసంధానం కాలేకపోతున్న ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించింది. “భవిష్యత్ రచయితలకు అవకాశాల ద్వారాలు తెరిచి, వారి – కథలు, స్క్రిప్ట్‌లు, స్క్రీన్‌లు” వెలుగులోకి తీసుకొచ్చే ఏకైక దార్శనికతతో, ఏడు భారతీయ భాషల్లో ఉత్తేజకరమైన, ఆకర్షణీయమైన బ్రాండ్ ఫిల్మ్‌తో జీ రైటర్స్ రూమ్ కార్యక్రమం ప్రకటించబడింది.
80 నగరాలు, 32 ఈవెంట్ సెంటర్లలో విస్తరించడం ద్వారా, ఆన్-ఎయిర్, డిజిటల్, ఆన్-గ్రౌండ్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించిన అధిక-ప్రభావ ప్రమోషన్ ద్వారా ఈ కార్యక్రమం విస్తరించనుంది. హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని నిబద్ధత కలిగిన కథకులు వారి ఊహ, నిర్మాణం, కథన నైపుణ్యం పెంపొందించుకునే దిశగా, సహకార రచయితల ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్‌సూర్ మాట్లాడుతూ, “భారతదేశంలోని ప్రముఖ కథకుల్లో ఒకరిగా మారేందుకు ఇది మేము అందిస్తున్న అవకాశం మాత్రమే కాదు. భవిష్యత్తు తరం రచయితల ప్రతిభను పెంపొందించే మా కర్తవ్యం కూడా ఇందులో భాగమే. జీలో, మా అతిపెద్ద బలం మా కథనాలు మాత్రమే కాదు, మేము గుర్తించి, అవకాశం ఇచ్చే కథకులు కూడా అని మేము విశ్వసిస్తున్నాము. జీ రైటర్స్ రూమ్‌తో సరికొత్త స్వరాలు, ఇప్పటికింకా చెవినపడని ఆలోచనలు, నిజాయితీ కలిగిన భావోద్వేగాలు రూపం సంతరించుకునే ప్రదేశాన్ని మేము సృష్టిస్తున్నాము. ఇది ఒక పోటీ కాదు – ఇది ఒక నిబద్ధత. స్క్రీన్‌లలో, ప్రాంతాల్లో, శైలుల్లో శాశ్వత అనుభవాలు నిర్మించడం కోసం భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన రచయితలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా క్రియేటర్లకు సాధికారత అందించడం, వారికి నైపుణ్యం, అవకాశం అందించడం మా విధి. ఎందుకంటే, కథ చెప్పే తీరు భవిష్యత్తు అనేది మనం ఏం చేస్తామనే దాని మీద మాత్రమే కాకుండా – మనం దేనితో ఆ పని చేస్తామనే దానిమీద కూడా అది ఆధారపడి ఉంటుంది” అన్నారు.
ZEEL చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహాదేవ్ మాట్లాడుతూ, “జీ రైటర్స్ రూమ్‌తో, మా బ్రాండ్ వాగ్దానంలో మేము ఒక అడుగు ముందుకు వేస్తున్నాము. కథ చెప్పే నైపుణ్యం మెరుగుపరచడం మీద దృష్టి సారించడం ద్వారా విభిన్నమైన, వైవిధ్యమైన కథలు చెప్పడంలో మాకు సహాయపడే రచయితల సంఘాన్ని మేము నిర్మిస్తున్నాము. ఉద్విగ్నులైన రచయితలు రేపటి కథకులుగా మారేందుకు ద్వారాలు తెరిచే స్థలాన్ని మేము సృష్టిస్తున్నాము” అని అన్నారు.
చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ – ఈస్ట్, నార్త్, ప్రీమియం క్లస్టర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌గా ఉన్న సామ్రాట్ ఘోష్ మాట్లాడుతూ, “బెంగాల్ ఎల్లప్పుడూ సాహిత్యం మరియు సినిమా సంబంధిత ప్రతిభకి కేంద్రంగా ఉంటోంది. వెలుగులోకి వస్తున్న బెంగాలీ కథకులు వారి స్వరాలను గుర్తించి, వారసత్వ, సమకాలీన సున్నితత్వాలను ప్రతిబింబించే కథనాలు రూపొందించడం కోసం జీ రైటర్స్ రూమ్‌తో మేము ఒక నూతన యుగం వేదిక ఏర్పాటు చేస్తున్నాము” అన్నారు.
చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ – సౌత్ & వెస్ట్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌గా ఉన్న సిజూ ప్రభాకరన్ మాట్లాడుతూ, “దేశంలోని అత్యంత శక్తివంతంగా కథలు చెప్పే సంస్కృతులకు, మరియు పశ్చిమ ప్రాంతాలు నిలయంగా ఉన్నాయి. అక్కడి ఆ అభిరుచి, సృజనాత్మకతను టీవీ, ఓటీటీ సినిమాల్లో వృద్ధి చెందగల వృత్తిగత నిర్మాణాత్మక కంటెంట్‌లోకి మళ్లించడంలో జీ రైటర్స్ రూమ్ సహాయపడుతుంది” అన్నారు.
టీవీ, ఓటీటీలు, సినిమాల్లో ‘Z’కి అవసరమైన కంటెంట్ కోసం ఆకర్షణీయ కొత్త ప్రపంచాలుగా, పాత్రోచితంగా కథన నిర్మాణాలుగా మలుస్తారు. ఎన్‌రోల్ చేసుకోవడానికి, సందర్శించండి [www.zeewritersroom.com]. ప్రతి అభ్యర్థి ఈ లింక్‌లోకి వెళ్లాలి:
· రచయితల కోసం పరీక్ష: రిజిస్టర్ చేసుకున్న పార్టిసిపెంట్లు ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలి. కచ్చితంగా టెస్ట్ రాయాలి.
· రచనా ప్రతిభ ఆధారంగా, టాప్ 10% మందిని రీడింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
· ఇంటర్వ్యూ ప్రక్రియ: సినీ పరిశ్రమకి చెందిన ప్యానెల్ ఫైనలిస్టులని ఎంపిక చేస్త్ఉంది.
· జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశం: టాప్ 100 మందిని జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వాళ్లు నిపుణుల మార్గదర్శకత్వంలో కథా ఆలోచనలకు మెరుగులు దిద్దుతారు. మరెందుకు లేటు, తక్షణం, జీ రైటర్స్ రూమ్‌లో చేరడం ద్వారా, భవిష్యత్ కంటెంట్ రూపకర్తలుగా అవకాశం అందుకోండి.