పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ పెద్ద పెద్ద కార్యక్రమాల్లో యోగా నేర్పించడమే కాకుండా, ఆయుర్వేద మూలికలతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను కూడా అందిస్తారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మలబద్ధక సమస్య పరిష్కరానికి పనిచేసే దివ్యౌషధం గురించి చెప్పారు. మీలో కూడా ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉన్నా.. దానితో చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే, బాబా రాందేవ్ చెప్పిన పద్ధతిని ప్రయత్నించవచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, ఉదయం కడుపు సరిగ్గా క్లియర్ కాకపోతే, ఇది ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా అనిపించవచ్చు.. కానీ దీని కారణంగా ఆ రోజంతా మనకు అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే, శ్రద్ధ అవసరం. మలబద్ధకం సమస్య ప్రతిరోజూ మలవిసర్జన చేయడంలో ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. మలవిసర్జన క్రమం తప్పకుండా చేయకపోతే, మన శరీరంలో చాలా అనారోగ్య సమస్యలు సంభవించవచ్చు.
ముఖ్యంతా తక్కువ ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా, రోజు మొత్తంలో మీరు తక్కువ నీటిని తాగుతున్నప్పుడు ఈ మలబద్దక సమస్య అనేది వస్తుంది. మనం చేసే పనిలో ఒత్తిడి కూడా మలబద్ధకానికి కారణం కావచ్చు. దీనితో పాటు, కొన్ని మందుల వల్ల కూడా మీకు ఈ సమస్య రావచ్చు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ఔషదాన్ని రామ్‌దేవ్ బాబా తన పతంజలి ద్వారా దేశవ్యాప్తంగా స్వదేశీ వస్తువులతో అనుసందానం చేయడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. దీనితో పాటు, ఆయన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను తొలగించడానికి యోగా, స్వదేశీ నివారణల గురించి చెబుతున్నారు. కాబట్టి మలబద్ధకం నుండి బయటపడటానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన పద్ధతిని తెలుసుకుందాం.
మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయకండి
ఈ మలబద్దక సమస్యను మనం నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే ఈ సమస్య దీర్ఘకాలంగా ఉండటం వల్ల పైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఈ సమస్య మన ప్రేగులను కూడా దెబ్బతీస్తుంది. మలబద్ధకాన్ని సాధారణ సమస్యగా భావించి విస్మరించకూడదు, ఈ సమస్యను సకాలంలో వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. దీని కోసం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడంతో పాటు పుష్కలంగా నీరు త్రాగడం మంచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం వంటి మీ రోజువారి అలవాట్లలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌పెట్టవచ్చు.
మలబద్దక సమస్యకు బాబా రామ్‌దేవ్ ఇచ్చిన సలహా..
మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, “పియర్” పండును తినమని రామ్‌దేవ్ బాబా సలహా ఇచ్చారు. మీకు మలబద్ధకం సమస్య ఉంటే, మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు పియర్ జ్యూస్ తాగాలి లేదా దాని నార్మల్‌గా తినడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని రామ్‌దేవ్ బాబా చెప్పారు. ఇది అరగంట నుండి ఒక గంటలోపు కడుపుని క్లియర్ చేస్తుందని ఆయన వివరించారు. ఇది కోలన్ థెరపీ లాగానే పనిచేస్తుందన్నారు.
మలమద్దకాన్ని దూరం చేసే మరో రెండు పండ్లు
పియర్‌తో పాటు ఈ మామిడి, జామ పండ్లను తినడం వల్ల కూడా మలబద్దక సమస్యను దూరం చేసుకోవచ్చని బాబా రాందేవ్ తెలిపారు. కానీ మధుమేహం ఉన్నవారు ఈ మామిడి తినకూడదు. ఈ సమస్యకు దేశీ మామిడి పండు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం జామకాయ సీజన్ కాదు, కానీ ఈ పండును క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చని రామ్ దేవ్ బాబా తెలిపారు.
పియర్ పండు ప్రయోజనాలు..
హెల్త్ లైన్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, మీడియం సైజు పియర్ తినడం వల్ల మనం 1 గ్రాము ప్రోటీన్, 101 కేలరీలను పొందవచ్చు. దీనితో పాటు, రోజువారీ విటమిన్ సిలో 9 శాతం ఇందులో లభిస్తుంది. ఇది విటమిన్ కె, పొటాషియం, రాగికి కూడా మంచి మూలం. పియర్ తినడం వల్ల మనకు 6 గ్రాముల ఫైబర్ కూడా లభిస్తుంది, ఇది జీర్ణక్రియను సరిగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మన మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.