Tirumala Free Songs Available For Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! టీటీడీ ఇప్పుడు ప్రకటనల్లేని భక్తి గీతాలను అందిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో వేలాది పాటలు ఉచితంగా వినొచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో ప్రకటనల బాధ తప్పుతుంది. తాళపత్రాల్లోని అరుదైన కీర్తనలు కూడా ఇక్కడ లభిస్తాయి. వెంటనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీకు ఇష్టమైన పాటలను వినండి, డౌన్‌లోడ్ చేసుకోండి! ఇంతకుముందు ఎన్నడూ లేని అనుభూతిని పొందండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
- టీటీడీ అంతరాయం లేకుండానే
- ఇకపై 24 గంటలూ అందుబాటులోకి

తిరుమల శ్రీవారి భక్తులు వారికి కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వందలాది పాటలు కనిపిస్తాయి. వాటిలో భక్తులకు నచ్చిన పాటను ఎంచుకుని వినవచ్చు. అంతేకాదు భక్తులు పాటలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది టీటీడీ. ఇప్పటివరకు భక్తులు పదిన్నర లక్షలకు పైగా కీర్తనలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉందని చెప్పాలి. ఇక భక్తులు అంతరాయం లేకుండా శ్రీవారి భక్తి గీతాలను వినే అవకాశం ఉంది.
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జులై 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. జులై 28న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం క్యూ అవసరం లేదు
సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతా మందిరం, ఆర్‌ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.