Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: మూలాలు మర్చిపోని పాన్ ఇండియా యాక్టర్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీలు అమ్ముతూ.. ఎవరో తెలుసా?

30 July 2025

Moto G86: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? భారత మార్కెట్లోకి కొత్తగా లాంచ్‌ అయిన ఈ బెస్ట్‌ బడ్జెట్‌ ఫోన్‌పై ఓ లుక్కేయండి..

30 July 2025

Donald Trump: భారత్‌కు ట్రంప్‌ సడెన్‌ షాక్.. 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటన!

30 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Amc Nominated Posts,ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులు భర్తీ.. 66మందితో లిస్ట్, 35 మంది మహిళలకు ఛాన్స్ – andhra pradesh government appoints 66 amc chairman nominated posts
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Amc Nominated Posts,ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులు భర్తీ.. 66మందితో లిస్ట్, 35 మంది మహిళలకు ఛాన్స్ – andhra pradesh government appoints 66 amc chairman nominated posts

.By .18 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Amc Nominated Posts,ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులు భర్తీ.. 66మందితో లిస్ట్, 35 మంది మహిళలకు ఛాన్స్ – andhra pradesh government appoints 66 amc chairman nominated posts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Government AMC Posts: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ఖరారు చేసింది. టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయించగా, ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ప్రోత్సాహకంగా రూ.260 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైలైట్:

  • ఏపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ
  • 66మందికి పదవులు.. జాబితా విడుదల
  • మహిళలకు ఏకంగా 32మందికి పదవులు
ఏపీ 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు
ఏపీ 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఖరారు చేశారు. ఇందులో టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయించారు. ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీలకు 10 పదవులు దక్కాయి. అలాగే ఎస్టీలకు 5, మైనార్టీలకు 5 పదవులు లభించాయి. ఈ నామినేటెడ్ పదవుల్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా 35 మంది మహిళలకు అవకాశం కల్పించారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొల్లు పెద్దిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లు పెద్దిరాజు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన పెద్దిరాజుకు ఈ అవకాశం లభించింది.ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను వరుసగా ప్రకటిస్తోంది. మొదటి విడతలో 47 మందిని, రెండో విడతలో 38 మందిని, మూడో విడతలో 30 మందిని, నాలుగో విడతలో 66 మందిని నియమించారు. ఈ నామినేటెడ్ పోస్టుల్లో.. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 181 మందిని భర్తీ చేశారు. కూటమి పార్టీల్లో సర్దుబాటులో భాగంగా కొన్ని పదవులను జనసేన, బీజేపీలకు కూడా ఇస్తున్నారు. అంతేకాదు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, సభ్యుల ఎంపికకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పదువుల్ని ప్రకటిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మేరకు పాలకవర్గ గౌరవ ఛైర్మన్‌గా సంబంధిత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటారు.. ఒక్కో కమిటీలో 20 మంది సభ్యులకు అవకాశం ఉంటుంది. ఛైర్మన్, సభ్యుల పదవీకాలం ఒక ఏడాది పాటు ఉంటుంది.. ఒకవేళ మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. ఇలా చాలామందికి పదవులు దక్కుతాయంటున్నారు. ఈ నామినేటెడ్ పదవులు భర్తీతో నియోజకవర్గస్థాయిలో కూటమి నేతలు జోష్‌లో ఉన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసినవారికి అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేస్తారని చెబుతున్నారు.

టీచర్‌గా మారిన చంద్రబాబు.. పిల్లలకు పాఠాలు.. లోకేష్ కూడా శ్రద్ధగా

రైతులకు నిధులు విడుదల

‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ప్రోత్సాహక ధర కింద జమ చేయనున్న నగదు రూ.260 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తోతాపురి మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహక నగదు చొప్పున మొత్తం 6.50 లక్షల టన్నులకు రూ.260 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేస్తారు’ అని అధికారులు తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి