AP Aadhaar Linked Mobile Number For License: ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్య గమనిక! మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడానికి రవాణా శాఖ వెబ్‌సైట్ sarathi.parivahan.gov.in ద్వారా అవకాశం కల్పించారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండానే, ఆధార్, లైసెన్స్ నంబర్లు నమోదు చేసి ఓటీపీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు. వెంటనే మీ నంబర్లను అప్‌డేట్ చేసుకోండి.
హైలైట్:
- ఏపీలో వాహనదారులకు అలర్ట్
- మొబైల్ నంబర్ మార్చుకునే ఛాన్స్
- చాలా సింపుల్‌గా అప్డేట్ చేసుకోవచ్చు

రవాణాశాఖ వెబ్‌సైట్‌లో ఆధార్, లైసెన్సు నెంబర్లు నమోదు చేసి ఈజీగా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. దీని కోసం వాహనదారులు sarathi.parivahan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. అందులో అదర్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసిన తర్వాత ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఫోన్ నెంబర్ మారిపోతుంది. వాహనదారులు చాలా సులభంగా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు అంటున్నారు అధికారులు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీకి సంబంధించి వాహనదారులు వారి మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
18 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీలు నీళ్లు.. హంద్రీ నీవా నుంచి విడుదల
అంతేకాదు చాలామంది సంవత్సరాల తరబడి వారి వాహనాలకు సంబంధించి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసి ఉండరు.. అలాంటి వారు కూడా వారి నంబర్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు.