ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కు సంబందించిన హీరోలు, హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అంతే కాదు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 ఆరుగురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు మెగా ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అయితే వచ్చిన వారు ఊరికే హీరోలు అయిపోలేదు.. తమ ప్రతిభతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ హీరోలుగా నిలబడ్డారు. అలాగే ఇంకొంతమంది స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతే కాదు ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా స్టార్స్ గా రాణించారు.
ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే
అవును మీరు వింటుంది నిజమే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి తెలియనని సినీ లవర్ ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. శ్రీదేవి మరణం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా శ్రీదేవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ శ్రీదేవికి కజిన్స్ అవుతారు.. అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ శ్రీదేవి కూతుర్లు.. ఈ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, సినిమాలు తగ్గించారు. జాన్వీ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఖుషీ కపూర్ ఇటీవలే హీరోయిన్ గా మారింది.
ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.