Guntur Discount On Mutton Chicken Steel Box: గుంటూరు ప్రజలకు శుభవార్త! మాంసం ప్రియులకు ఇది నిజంగా పండగే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. స్టీల్ బాక్సులతో వస్తే చికెన్, మటన్ ధరలపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, గుంటూరు కార్పొరేషన్ సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డును గెలుచుకుంది. చెత్తకు డబ్బులు ఇచ్చే స్వచ్ఛ రథం కూడా ప్రారంభమైంది. గుంటూరువాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!
హైలైట్:
- గుంటూరు ప్రజలకు సరికొత్త ఆఫర్
- మటన్, చికెన్ ధరలపై డిస్కౌంట్
- కాకపోతే ఈ చిన్న పనిచేయాల్సిందే

కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అవార్డుల్ని ప్రకటించారు. పరిశుభ్రతలో ఉన్నత ప్రమాణాలు పాటించిన 23 నగరాలను సూపర్ స్వచ్ఛలీగ్ నగరాలుగా ప్రకటించారు. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల జాబితాలో గుంటూరుకు స్థానం దక్కింది. గుంటూరుకు 5స్టార్ రేటింగ్ వచ్చింది. తడి, పొడి చెత్తను వేరు చేయడం, తరలిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే వస్తువులపై నిషేధం విధిస్తున్నారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు.
18 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీలు నీళ్లు.. హంద్రీ నీవా నుంచి విడుదల
గుంటూరు జిల్లాలో స్వచ్ఛ రథం కార్యక్రమం ప్రారంభమైంది. చెత్తకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుతోనే నిత్యావసర సరుకులు కొనుక్కోవచ్చు. ప్రజలకు ఇంటి వద్దే చెత్తకు డబ్బులు, సరుకులు అందుతున్నాయి. గుంటూరు రూరల్ మండలం లాల్ పురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిబ్బంది వాహనాల్లో ఇంటింటికీ వెళ్లి పనికిరాని వస్తువులు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి సేకరించిన చెత్తకు విలువ కట్టి, బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. చెత్తకు ఎంత విలువ నిర్ణయించారు?.. ఎలాంటి నిత్యావసర వస్తువులు ఇస్తున్నారో వివరాలను స్వచ్ఛ రథం వాహనంపై రాసి ఉంటుంది. ముందుగా ప్రజల నుండి సేకరించిన చెత్తకు రేటు ప్రకారం డబ్బు ఇస్తారు.. ఆ డబ్బుతో నిత్యావసర సరుకులు కొనుక్కోవచ్చు.