బొంగు లో చికెన్ ఇది మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పరిచయమున్న వంటకం. బాగా మసాలా దట్టించిమ్యారినేట్ చేసిన చికెన్ ను వెదురు ముక్కలో కూర్చి దానికి మూతికి అడ్డంగా ఆకులు కట్టి కట్టెల్లో పెట్టి ఆ వెదురు బొంగుని కాల్చుతారు. వెదురులోని సారం చికెన్ కు పట్టడం తో అది రుచికరంగా తయారు అవుతుంది. ఇక ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు అత్యంత ఇష్టంగా తినే మరో కూర వెదురు కొమ్ము కూర.
ఈ కొమ్ము కూర తయారీ చేయాలంటే.. ముందుగా గిరిజనులు అడవిలోకి వెళ్లి లేత వెదురు పిలకలను కోసుకు వస్తారు. వాటి పై పొరను నీటిలో శుభ్రం చేసి, లేత కొమ్ములను కోరి ఉడికించి పప్పులో వేస్తారు. ఇలా కేవలం పప్పు మాత్రమే కాకుండా వేపుడుగాను వండుతారు. నాన్ వెజ్ వంటల్లో నూ ఈ కోరు వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందని జరిగిన మహిళ జ్యోతి చెబుతున్నారు. కేవలం రుచికోసం మాత్రమే కాకుండా మహిళలకు ఇలా వెదురు కొమ్ముల కూరను ఆహారంగా తీసుకోవటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. అసలు వెదురు కొమ్ముల కూర ఎలా చేస్తారంటే..
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..