బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలోని కర్ణాటక ప్రాంతాన్ని ఉపయోగించే వాహనదారులు త్వరలో టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) హెడిగెనబెలే (హోస్కోట్ సమీపంలో) సుందరపాళ్య (KGF సమీపంలో) మధ్య 71 కిలోమీటర్ల విభాగానికి టోల్ రేట్లను ఖరారు చేసింది. ఈ విభాగం ఏడు నెలలకు పైగా టోల్ వసూలు లేకుండా అనధికారికంగా ట్రాఫిక్‌కు తెరిచి ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లోనే ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే టోల్ కట్టాల్సిందే. సాంకేతిక వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి కావడంతో ఆ రోడ్డుకు టోల్ వసూలు ప్రారంభించనున్నారు.
వాహన రకం, మార్గం ఆధారంగా టోల్ ఛార్జీలు ఇలా ఉన్నాయి..
కార్లు, జీపులు
- హెడిగెనబెలె నుండి సుందరపాళ్యకు వెళ్తుంటే.. రూ. 185
- తిరుగు ప్రయాణం: రూ. 275
- రివర్స్ దిశలో సింగిల్ ట్రిప్: రూ. 190
- నెలవారీ పాస్ (50 ట్రిప్పులు): రూ. 6,105 (హెడిగెనబెలె నుండి సుందరపాళ్య)
- నెలవారీ పాస్ రివర్స్‌లో: రూ. 6,260
తేలికపాటి వాణిజ్య వాహనాలు (LCVలు), తేలికపాటి వస్తువుల వాహనాలు (LGVలు) మినీ-బస్సుల కోసం:
- సింగిల్ ట్రిప్ (హెడిగెనబెలె నుండి సుందరపాళ్యం): రూ. 295
- తిరుగు ప్రయాణం: రూ. 445
- సింగిల్ ట్రిప్ (సుందరపాళ్యం నుండి హెడిగెనబెలె): రూ. 305
- తిరుగు ప్రయాణం: రూ. 455
ట్రక్కులు, పూర్తి-పరిమాణ బస్సులు వంటి భారీ వాహనాల కోసం:
- సింగిల్ ట్రిప్ (హెడిగెనబెలె నుండి సుందరపాళ్యం): రూ. 620
- తిరుగు ప్రయాణం: రూ. 930
- సింగిల్ ట్రిప్ (సుందరపాళ్యం నుండి హెడిగెనబెలె): రూ. 635
- తిరుగు ప్రయాణం: రూ. 955
మొత్తం నాలుగు టోల్ ప్లాజాలు
- హెడిజెనబెలె
- అగ్రహార
- కృష్ణరాజపుర
- సుందరపాళ్య
ఈ ఎక్స్‌ప్రెస్‌వే గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లేలా రూపొందించారు. భద్రతా కారణాల దృష్ట్యా ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే అసంపూర్ణ కంచె కారణంగా అనేక మంది బైకర్లు ఈ హైవేపై ప్రయాణిస్తున్నారు. ఈ ఉల్లంఘనలను అరికట్టడానికి, ఫెన్సింగ్ పూర్తిగా పూర్తయ్యే వరకు కీలక ప్రదేశాలు, టోల్ ప్లాజాలలో హోమ్ గార్డ్‌లను మోహరించడానికి NHAI అనుమతి కోరుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి