అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది. నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాళ్ల పైకివస్తూ పోతూ ఉంది. దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది. ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు. అయితే చెప్పును చేతితో తీసుకోవచ్చనుకున్నాడు. దీంతో ఆయుష్ చేయి చాపబోయాడు. రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టుతప్పి అతడు నీళ్లలో పడిపోయాడు. అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టుదొరక్క.. స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. ఒడ్డున ఉన్న స్నేహితులకు ఏం చేయాలో తెలియక భోరున ఏడుస్తూ అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం.. చివరికి ఆయుష్ మృతదేహాన్ని బయటకు తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెప్పారు?