Tiruchanur Sri Padmavathi Ammavari Temple Varalakshmi Vratham: శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వ్రతంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులకు పలు కానుకలు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ బహుమతిగా అందజేస్తారు.
హైలైట్:
- తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
- ఈ నెల 16న వైభవంగా నిర్వహించనున్నారు
- భక్తులకు కానుకల్ని అందజేయనున్న టీటీడీ

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల వెళ్లే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త
మహామంగళ దేవత, లక్ష్మీ అవతారమైన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిన సౌభాగ్యదేవత. తిరుచానూరులో చేసే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శించాలి. అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి, దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి, దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటుచేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది.
భారతీయ సంస్కృతికి వైఖానస ఆగమ శాస్త్రమే ప్రమాణం
తిరుమల శ్రీ వేంకటటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం మూలమని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యులలో ఒకరైన శ్రీ కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథంతో శాస్త్రాధ్యయనం చేసి సమాజానికి సేవచేయాలన్నారు. శ్రీవిఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ, ఆలయ సంస్కృతికి ఆధారమైన ఆగమశాస్త్రాల పరిరక్షణ సమాజం బాధ్యతగా స్వీకరించాలని, జ్ఞానాన్ని అందించిన మహర్షుల జయంతులను పండుగలుగా జరుపుకుంటూ, ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ, భగవద్దర్శనంతో ప్రశాంత జీవనం పొందాలన్నారు.
శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధినీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు ప్రసంగిస్తూ, పూర్వ కాలంలో అవతరించిన శ్రీ శ్రీ విఖనస మహర్షి, శ్రీ భృగు, శ్రీ అత్రి, శ్రీ మరీచి, శ్రీ కశ్యప మహర్షుల జ్ఞాన ఫలాలు నేటికీ సమాజాన్ని ధర్మమార్గంలో పయనింపజేస్తూ సమాజాన్ని ఆలయ వ్యవస్థతో అనుసంథానం గావించిందని చెప్పారు. మానవాళిని మహోన్నత స్థితికి చేర్చే ఆరాధనా విధానం శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథం లో వివరించారని తెలిపారు. ఈ సభలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆచార్యులు, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర పండితులు పాల్గొన్నారు.