సోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక చిన్నారి బాలిక ఒక భారీ కొండచిలువపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతోంది. ఈ వీడియోలో ఇంటి బయట ఉంచిన సోఫాపై ఒక పెద్ద కొండచిలువ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ కొండచిలువ సోఫాపై ఎక్కి అవతలి వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు ఇంట్లో ఉన్న ఒక చిన్న బాలిక ఆ కొండ చిలువని గమనించింది.
అయితే ఆశ్చర్యంగా అంత పెద్ద కొండచిలువను చూసి భయంతో బాలిక పారిపోలేదు.. సరి కదా.. ఆ అమ్మాయి నవ్వుతూ దాని దగ్గరికి వెళ్లి దానిపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అసలు ఆ బాలిక ఏదో ఒక ఆట బొమ్మ లేదా వాహనం అన్నట్లుగా కొండచిలువ మీదకు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అదే సమయంలో ఆ కొండచిలువ మెల్లగా పాకుతూ మరొక వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అదే సమయంలో.. ఆ బాలిక కూడా బోసి నోటితో నవ్వుతూ కొండ చిలువపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ వీడియో చూస్తుంటే.. ఇలా కొండ చిలువ మీద బాలిక ఎక్కడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సమీపంలో ఉన్న ఎవరో వీడియో తీస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడిది? వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు. బాలిక క్షేమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు నవ్వుతుంది.. తర్వాత ఏడుస్తుంది ఒకరు కామెంట్ చేయగా.. కొండ చిలువ పెంపుడు జంతువు కాదు జాగ్రత్త సుమా అని మరొకరు .. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు నిర్లక్షమే అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ నెటిజన్లు బాలిక రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..