ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ప్రధాన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ కార్లలో కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. హోండా అతి త్వరలో చాలా చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. హోండా N-One e పేరుతో మార్కెంట్లో ఆవిష్కరించింది. ఇప్పటివరకు కంపెనీ తయారు చేసిన అత్యంత కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో హోండా తన ఫ్యూచరిస్టిక్ సూపర్ ఈవీ కాన్సెప్ట్‌లో దీనిని మొదటిసారి ప్రదర్శించింది. ఈ మోడల్ హైటెక్, ప్రయోగాత్మక కాన్సెప్ట్ కాకుండా రోజువారీ ఉపయోగం కోసం తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. హోండా దీనిని సెప్టెంబర్‌లో జపాన్‌లో, తరువాత యూకేలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
హోండా ఎన్ వన్ ఈ..ఎలక్ట్రిక్ ప్లాట్‌ను N-Van e నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. N-Van e ఒకే ఛార్జ్‌లో దాదాపు 245 కి.మీ దూరం వెళ్తుంది. దీనికి 50 కి.వా. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ చేయగలదు. ఈ ఫీచర్ N-One eలో కూడా అందుబాటులో ఉంటుంది. నివేదికల ప్రకారం, దీని పవర్ అవుట్‌పుట్ దాదాపు 63 bhp ఉంటుంది. ఇక్కడ చూడాల్సింది పవర్ కాదుని.. ఈజీ డ్రైవింగ్, మంచి మైలేజ్, తక్కువ ధరను అని నిపుణులు చెబుతున్నారు.
అద్భుతమైన ఫీచర్స్..
ఈ కారు క్యాబిన్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో ముఖ్యమైన కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్లు, రోటరీ డయల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే క్రింద ఒక చిన్న షెల్ఫ్ ఉన్నాయి. ఇది 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లను కలిగి ఉంది. దీనివల్ల అవసరమైతే సీట్లను ఫోల్డ్ చేసి లగేజీ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ కారు యొక్క ప్రత్యేక లక్షణం వెహికల్-టు-లోడ్.. దీని సహాయంతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కోసం అడాప్టర్‌ను వాడాల్సి ఉంటుంది.
కారు డిజైన్..?
కారు డిజైన్ సూపర్ EV కాన్సెప్ట్‌కి అనుగుణంగా ఉంటుంది. కానీ ఇది సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేయబడింది. ఈ కారు రెట్రో స్టైల్ బాక్సీ లుక్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లో కొద్దిగా వంపుతిరిగిన డిజైన్‌ను కలిగి ఉంది. గ్రిల్ పూర్తిగా మూసివేసి ఉంటుంది. ఛార్జింగ్ పోర్టును సైతం బాగా ఇంటిగ్రేట్ చేశారు.
సైజు ఎంత ఉంటుంది
ఈ కారు పొడవు దాదాపు 3,400 మి.మీ. ఉంటుందని అంచాన వేస్తున్నారు. దీన్ని అప్‌రైట్ అప్పియరెన్స్, కాంపాక్ట్ సైజ్, సింపుల్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో సింపుల్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..