ఏ ఇంట్లో అయితే వాస్తు నియమాలను సరిగ్గా పాటించరో వారు అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. అందుకే ముఖ్యంగా ఇంటి విషయంలో తప్పక వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. లేకపోతే ఆర్థిక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక కొంత మంది తెలియక చేసే తప్పుల వలన కూడా సంపాదించిన డబ్బు ఇంట్లో సరిగా నిలవదంట. దీనికి ముఖ్యకారణం డబ్బు వాస్తు దోషం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇంట్లో శ్రేయస్సు, సంపదపెరగాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. ఇంటి శ్రేయస్సు పెంచడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా ఉండేలా చూడాలి. ఆ ప్రదేశంలో మురికిగా ఉండటం, ఇరిగిపోయిన వస్తువులు వంటివి అస్సలే ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు. ఇంటి ప్రధాన ద్వారా శుభ్రంగా ఉన్నప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంట. ఇంటిలోపల సంపద పెరుగుతుందంట.
ఇంట్లో సంపద పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోవాలి అంటే తప్పకుండా, ప్రతి శుక్రవారం కుబేరుడిని, లక్ష్మీ దేవిని పూజించాలంట. దీని వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి సంపద వృద్ధి చెందుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అలాగే, లక్ష్మీదేవికి ఎరుపు లేదా గులాబీ రంగు తామర పువ్వులను సమర్పించడం చాలా శుభప్రదం. దీని వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంట.
అలాగే ఆర్థిక సమస్యలు తగ్గిపోవాలి, పేదరికం నుంచి బయటపడాలి అంటే మీ ఇంటిలో ఉన్న అక్వేరియం , ఫౌటెన్ వంటి నీటి చిత్రాలను ఉత్తర దిశలో ఉంచాలంట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశ కుబేరుని దిశ, దీని కారణంగా నీటికి సంబంధించినదానిని ఉత్తర దిశలో ఉండనివ్వడం వలన కుభేరుని అనుగ్రహం కలిగి ఆర్థికంగా బలపడతారంట.
వాస్తు శాస్రం ప్రకారం, మీ ఇంటి డబ్బుకు సంబంధించిన అల్మరాను దక్షిణ దిశ ఉంచడం శ్రేయస్కరం. దీని వలన సంపద స్థిరంగా ఉంటుందంట.