రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం భారతదేశానికి శాపంగా మారింది. రష్యతో స్నేహ సంబంధాలు, ఆదేశం నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధాలు, ముడి చమురు దిగుమతి చేసుకోవడం అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. అమెరికా విధించిన గడువు మేరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని.. ఈ నేపథ్యంలోనే భారత్‌పై సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. సుంకం విధిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై బెదిరించే రీతిలో మాట్లాడారు.
భారత్‌పై సుంకాన్ని విధించే కొద్ది గంటల ముందే ట్రంప్ వైట్‌హైస్‌లో రిపోర్టర్లతో ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెరికా విధించిన గడువు మేరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరలేదని.. ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్ట్ 1లోపు చర్చలు ఫైనల్ కాకపోతే భారత్‌పై 20 నుంచి 25 శాతం సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నామని ఆయన అన్నారు. తన విజ్ఞప్తి మేరకే భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ముగిసిందన్నారు. అయితే భారత్ తమకు మంచి మిత్ర దేశం అయినప్పటికీ మీగతా దేశాలతో పోలిస్తే భారత్ తమపై ఎక్కువ సుంకాలను విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.
25% tariff on India, plus penalty!
Does he not realize, American companies need Indian consumers more than us needing them?
Our merchandise Exports to the US are much lower than Service exports, of which, even Pharma is an important part.
DJT hitting a hammer on his own foot! pic.twitter.com/X181xOoGb5
— Mangalam Maloo (@blitzkreigm) July 30, 2025
ఆగస్ట్ 1వరకు చర్చలు ఫైనల్ కాకపోతే సుంకాన్ని విధిస్తానని డోనాల్డ్ ట్రంప్ గంటల వ్యవధిలో తన నిర్ణయాన్ని మార్చుకొని భారత్‌పై సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు ముఖ్య కారణం భారత్ రష్యాతో స్నేహ సంబంధాలు పెట్టుకొవడం, గత కొన్ని రోజులుగా రష్యా నుంచి ముడి చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడమేనని తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.