
సాధారణంగా సినిమా సెలబ్రిటీలంటే చాలా రిచ్ అని అనుకుంటారు చాలామంది. కోట్లలో ఆస్తులు, లగ్జరీ లైఫ్, విలాసవంతమైన భవనాలు, లెక్కలేనన్నీ కార్లు.. ఇలా లార్జర్ ద్యాన్ లైఫ్ అనుకుంటారు. కానీ వారి జీవితాల్లోనూ కన్నీళ్లు, కష్టాలు ఉంటాయి. సెలబ్రిటీ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ నటి చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రేమో మందుకు బానిసైపోయాడు. ఎవరూ తనను పట్టించుకోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఓ అనాథాశ్రమంలో పెరిగింది. కంటి నిండా నిద్ర లేదు. కడుపు నిండా తిండి లేదు. ఎన్నో ఇబ్బందులు పడి ఎలాగోలా చదువు కుంది. ఒకానొకదశలో లంచ్ టైంలో పానీపూరి తిని కడుపు నింపుకొంది. దీంతో టీబీ తదితర సమస్యలు చుట్టు ముట్టాయి. జర్నలిజం పూర్తి చేసి ఒక ప్రముఖ దినపత్రికలో కూడా పనిచేసింది. కానీ నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కాకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ సినిమాలు, టీవీ షోస్ చేస్తూ తరచూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు తేజస్విని మదివాడ.
మహేశ్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి. ఆ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది. అయితే వీటి తర్వాత ఎక్కువగా సెకెండ్ లీడ్ రోల్స్ లోనే కనిపించింది తేజస్వి. అందులోనూ చాలా వరకు బోల్డ్ పాత్రలే పోషించింది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసిందీ అందాల తార.
తేజస్వి మదివాడ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కాకమ్మ కథలు టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది తేజస్వి మదివాడ. సినిమా సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు ఈ టాక్ షోకు హాజరవుతున్నారు. అయితే ఈ టాక్ షోలో తేజస్విని అడుగుతోన్న కొన్ని ప్రశ్నలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. వీటిపై నెటిజన్ల నుంచి కూడా రకరకాల రియాక్షన్లు వస్తున్నాయి.
ఆహా కాకమ్మ కథలు టాక్ షోలో తేజస్వి..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .