మేషం: ఈ రాశికి రాహువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అన్ని విధాలా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో గృహ యోగం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు గురు బలం పొందడం వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి.
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు గురువు లక్షణాలను పుణికి పుచ్చు కోవడం వల్ల వైవాహిక సమస్యలకు తెరపడే అవకాశం ఉంది. విడాకుల కేసులో ఉన్నవారు సైతం మళ్లీ ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. గృహ యోగం పడుతుంది.
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు శుభ గ్రహంగా మారడం వల్ల సంతాన ప్రాప్తికి, పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అన్ని వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభంతో పాటు లాటరీ యోగం కూడా పట్టే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో ఉన్న రాహువుకు శుభత్వం కలిగినందువల్ల కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలగడంతో పాటు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువుకు గురు బలం కలగడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలుగుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా గౌరవాభిమానాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.