సినిమా ఇండస్ట్రీలో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన హీరో ఎవరో మీకు తెలుసా? ఈ నటుకి సుమారు రూ. 7500 కోట్ల ఆస్తులున్నాయి. ఇది మాత్రమే కాదు. ఈ సూపర్ స్టార్ భార్య కూడా మంచి బిజినెస్ ఉమెన్. దీని ద్వారా ఆమె కూడా వందలాది కోట్ల సంపాదిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, స్క్వేర్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నటుల జాబితాను ప్రచురించింది. ఈ జాబితాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్ల పేర్లు ఉన్నాయి. అందులో మన దేశానికి చెందిన ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడు. విచిత్రమేమిటంటే.. గత కొన్ని దశాబ్దాలుగా ఆ నటుడు పేరు ఈ జాబితాలో కనిపిస్తుంది. స్క్వేర్ మ్యాగజీన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ హీరో మొత్తం ఆస్తుల విలువ సుమారు 876.5 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 7500 కోట్లు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? అతను మరెవరో కాదు బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.
సుమారు రూ. 7500 కోట్ల ఆస్తులతో ఇండియాలోనే రిచెస్ట్ హీరోగ అవతరించాడు బాలీవుడ్ కింగ్ ఖాన్. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాల నాలుగో స్థానంలో నిలిచాడు. షారుఖ్ ఆస్తుల సంగతి పక్కన పెడితే.. ఆయన భార్య గౌరీ ఖాన్ కు కూడా వందలాది కోట్ల ఆస్తులున్నాయి. ఆమె ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. అలాగే ఇతర వ్యాపారాలు కూడా చేస్తోంది. నిర్మాతగా సినిమాలు కూడా తీస్తోంది. 2002లో, గౌరీ షారుఖ్ తో కలిసి ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.
ఇవి కూడా చదవండి
షారుఖ్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
గౌరీ ఖాన్ ముంబైలో లగ్జరీ రెస్టారెంట్స్ నిర్వహిస్తోంది. దీనితో పాటు, ఆమెకు ముంబై, ఢిల్లీ, అలీబాగ్, లండన్, దుబాయ్, లాస్ ఏంజిల్స్ లలో విలాసవంతమైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ‘లైఫ్‌స్టైల్ ఆసియా’ ఇచ్చిన సమాచారం ప్రకారం, గౌరీ మొత్తం సంపద 1600 కోట్లకు పైగా నే ఉంటోంది. కాగా ముంబైలో గౌరీకి ఒక విలాసవంతమైన ఇంటీరియర్ హౌస్ ఉంది. దీని విలువ దాదాపు 150 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
కుమారుడితో షారుఖ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.