తమ ప్రతిభతో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. తమ నటనతో తక్కువ టైంలోనే స్టార్స్ గా మారిన హీరోల్లో ఈ హీరో ఒకరు. భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఆ హీరో. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ముందు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరో.. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆయన. విభిన్నమైన కథలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ స్టార్ హీరో.. సినిమాల్లోకి రాక ముందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేశాడు. డబ్బులు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనే పని చేసి అక్కడే రాత్రి భోజనం చేసేవాడ్ని అని తెలిపాడు ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రతిభ ఉంటే ప్రేక్షకులే నెత్తిమీద పెట్టుకుంటారు అనడానికి ఉదాహరణ విజయ్ సేతుపతి. ఎంతో మంది అభిమాన నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగు, హిందీలోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్. సినిమా రంగంలోకి రాకముందు విజయ్ చాలా కష్టమైన జీవితం గడిపారు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. మిగతా సెలబ్రెటీలలా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు మక్కల్ సెల్వన్. విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
సహజమైన నటనతో మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి దుబాయ్‌లో అకౌంటెంట్ గా చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరారు. ఆతర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను సక్సెస్ అయ్యారు. ఆతర్వాత ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా చేస్తూ రాణిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
అయితే విజయ్ సేతుపతి సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా..? గతంలో ఓ ప్రోగ్రాం లో మాట్లాడుతూ.. తాను ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేశాను అని తెలిపారు. అలాగే విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపారు.. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేసేవాడిని తెలిపారు విజయ్. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తూ.. అక్కడే రాత్రి భోజనం కూడా చేసేవాడినని అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు విజయ్. అంతే కాదు దుబాయ్ లో అకౌంటెంట్ గాను పని చేశారు విజయ్ సేతుపతి. ఆతర్వాత సినిమాలపై మక్కువతో.. చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆతర్వాత హీరోగా మారారు విజయ్. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్ సేతుపతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.