విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కింగ్ డమ్ సినిమా రిలీజ్‌కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన గా నటించింది. సత్యదేవ్, మలయాళ నటుడు వెంకటేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గురువారం ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీతో పాటు నిర్మాత నాగవంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. కింగ్‌డమ్ ట్రైలర్ చివర్లో ఓ క్యామియో రోల్‌ను చూపించారు. ఆ రోల్‌లో ఉన్నది స్టార్ హీరోనా? అని అడిగారు. దీనికి విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. దీనికి సమాధానం మీరు థియేటర్లలోనే చూడాలి. మీరు ఊహించినట్టే ఒక పెద్ద హీరోనే ఉంటాడని ఆన్సరిచ్చారు. దీంతో ఆ బడా హీరో ఎవరబ్బా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
కాగా కింగ్ డమ్ ట్రైలర్ చివర్లో కాంతార స్టైల్లో ఒక వ్యక్తి మొహానికి మాస్క్ ధరించి కనిపించాడు. అతను స్టార్ నటుడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతను కన్నడ హీరో రక్షిత్ శెట్టి అని కొందరు మరికొందరేమో హీరో నాని అంటూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తుననారు. ఇంకొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ను ప్రస్తావిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఉన్న ఆ స్టార్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.
వీడియో ఇదిగో..
Who Is That Big Hero? pic.twitter.com/w5M7x0SKMH
— Aakashavaani (@TheAakashavaani) July 30, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కింగ్ డమ్ టీమ్..
It all comes full circle and this is a POWER PACKED MOMENT for the #Kingdom family receiving wishes from the man himself 💥💥
Team had the privilege of meeting @PawanKalyan garu today on the sets of #UstaadBhagatSingh where he graciously conveyed his best wishes to the entire… pic.twitter.com/MO9BqNjiQg
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి