తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గ్యాంగులో వేషాలు వేస్తున్న బోరబండ భాను అనే నటుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన చాలా చిత్రాల్లో ప్రతినాయకుడి పక్కన గ్యాంగ్‌లో కనిపించేవారు. ఒక మిత్రుడు పిలవడంతో గండికోట వెళ్లిన భాను అక్కడ పార్టీ చేసుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో ఆయన ప్రయాణించేకారు ప్రమాదానికి గురవ్వడంతో.. మృతి చెందారు. కాగా ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన గండిపేట వచ్చానని ఫ్రెండ్స్‌తో సరదాగా గుడపుతున్నట్లు వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టారు. కానీ రోజు ముగిసే సమయానికి మృత్యువు వెంటాడింది.
భాను మరణం పట్లు ప్రతినాయక పాత్రలు పోషించే పలువురు నటుడు సంతాపం వ్యక్తం చేశారు. నెగటివ్ రోల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఆయనకు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బయట ఎంతో హుందాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే భాను మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆయన స్నేహితులు, సహచర నటులు చెబుతున్నారు.