మార్నింగ్ వాక్ వెళ్లిన మహిళపై హస్కీ జాతికి చెందిన పెంపుడు కుక్క దాడి చేసిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని సొసైటీలో నివసించే ఒక మహిళ మరో ఇద్దరితో కలిసి ఒక మహిళ మార్నింగ్ వాక్‌కు వచ్చారు. అలా ఫుట్‌పాత్‌పై నడుకుంటూ వెళ్తున్నారు. అదే క్రమంలో మరో మహిళ హస్కి జాతికి చెందిన ఒక పెంపుడు కుక్కను తీసుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళను చూసిన ఆ పెంపుడు కుక్క ఒక్కాసారిగా ఆమెపైకి దూసుకెళ్లింది. ఆమె చేయి కొరికి, ఆమెను లాగి కిందపడేసింది.
అయితే యజమానికి దాన్ని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది ఆమెపై దాడి చేస్తూనే ఉంది. ఇలా చాలా సేపటి తర్వాత అతడు తన బలాన్ని మొత్తం ఉపయోగించి ఎలాగోలా కున్నను అడ్డుకోగలిగాడు. కుక్క దాడిలో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుక్కను పక్కకు లాగేసిన వెంబడే స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు అత్యవసర చికిత్స అందించారు.
దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో కుక్కల దాడి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాగా మరోసారి ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికుల్లో ఆందోళనను రేకెత్తించింది.
Scary shit!
🚨Woman mauled by a pet Husky in luxury apartment complex on Gurugram’s Golf Course Road
Dog latches onto her hand, refusing to let go…bystanders finally helped
A national task force on dog safety is probably the need of the hour pic.twitter.com/5gs3uEDU3R
— Nabila Jamal (@nabilajamal_) July 30, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.