ములుగు జిల్లా జె.డి మల్లంపేట మండల శివారులో ఇద్దరు దొంగలు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు. లారీలో బ్యాటరీ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న లారీ నుండి బ్యాటరీ దొంగతనం చేశారు. దొంగిలించిన ఆ బ్యాటరీని బైక్‌పై పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, మరి కొంతమంది లారీ డ్రైవర్ల ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకేముంది అడ్డంగా బుక్కైన ఆ దొంగలు తమను వదిలేయమని.. దొంగతనం చేయడం ఫస్ట్ టైమని.. బుద్ధి గడ్డి తిని బ్యాటరీ దొంగలించామని లారీ డ్రైవర్ల కాళ్ళ మీద పడి వేడుకున్నారు.
అయితే బ్యాటరీ దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ములుగు మీదుగా భూపాలపల్లికి వెళ్తున్న క్రమంలో జే.డీ మల్లంపల్లి వద్ద రోడ్డు పక్కన ఒక లారీ పార్కింగ్ చేసి ఉంది. లారీ పరిసరాల్లో ఎవరు కనిపించకపోవడంతో కక్కుర్తి పడ్డారు. ఆ లారీ బ్యాటరీని దొంగిలించారు. బైక్ పై పెట్టుకొని పారిపోతున్న క్రమంలోనే పాటుపడ్డారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.