అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్స్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడమేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వచ్చే ద్విచక్ర వాహనాలకు ఇంధనం పోయొద్దని బంక్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
No helmet, No petrol: Indore to enforce new order from August 1#NoHelmetNoFuel #RoadSafety #IndoreNews #TrafficRulesIndiahttps://t.co/YbDy6By2Wf
— Telangana Today (@TelanganaToday) July 30, 2025
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేఫథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మొదటగా ఇండోర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేయనుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు, సీట్‌బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించే వారు పెట్రోల్ బంక్‌లోకి వస్తే వారికి ఇందనం పోయవద్దని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించని పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆదేశాలు పాటించని వారికి ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.5వేల ఫైన్ వేయనున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.