Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్ తినండి.. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతోంది..!

31 July 2025

Actress Radhika: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?

31 July 2025

చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్‌

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Women Free Bus Travel 2025,Stree Shakti: ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఆ పేరు ఫైనల్.. టికెట్ ఎలా ఉందో చూశారా! – andhra pradesh women free bus travel zero fare ticket photo goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Women Free Bus Travel Ticket: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకం అమలు కానుంది. ఉచిత ప్రయాణానికి సంబంధించిన జీరో టికెట్ ఫోటో వైరల్ అవుతోంది. ఆధార్, ఓటరు కార్డు చూపి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ పథకం మహిళా సాధికారతకు ఒక గొప్ప ముందడుగు కానుంది.

హైలైట్:

  • ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  • ఈ పథకానికి ఆ పేరు దాదాపుగా ఫైనల్ చేశారు
  • సోషల్ మీడియాలో టికెట్ వైరల్ అవుతోంది
స్త్రీ శక్తి ఉచిత బస్‌ టికెట్‌ ఇదే
స్త్రీ శక్తి ఉచిత బస్‌ టికెట్‌ ఇదే (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ఆగస్టు 15 రోజు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముద్రించిన జీరో టికెట్ ఫోటో వైరల్ అవుతోంది. ఆ టికెట్‌పై పైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరుతో పాటుగా డిపో పేరు, స్త్రీశక్తి, ప్రయాణించే రూట్ వంటి అంశాల్ని ప్రింట్ చేశారు. ఆ రూట్‌లో మొత్తం టికెట్‌ ధర, ప్రభుత్వ రాయితీ చెల్లించవలసింది రూ.0.00గా ముద్రించారు. ఈ టికెట్‌‌‌ను పరిశీలించిన తర్వాత ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తిగా పేరు పెట్టారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని మహిళలు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్, ఓటరు లేదా పాన్ కార్డు చూపించి ప్రయాణం చేయొచ్చు. కొత్త బస్సులు వచ్చే వరకు పాత బస్సులనే ఉచిత ప్రయాణానికి ఉపయోగిస్తారు. బస్సుల టైమింగ్స్, సిబ్బంది డ్యూటీ సమయాల్లో మార్పులు ఉండవు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఏపీకి కొత్తగా 1,050 బస్సులు రానున్నాయి.. ప్రతి ఏటా కొత్త ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మహిళల ఉచిత ప్రయాణ పథకం కోసం అన్ని బస్‌స్టేషన్లలో ఏర్పాట్లు చేశారు. బస్‌స్టేషన్లలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశం తర్వాత ఈ పథకం యొక్క విధివిధానాలపై పూర్తి స్పష్టత వస్తుంది. కొద్దిరోజులుగా రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్, ఆర్టీసీ ఎండీలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉచిత బస్సు పథకంపై సమీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభంకానుండటంతో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి