August New Rules: ఆగస్టు 1, 2025 నుండి సామాన్యుల ఆర్థిక విషయాలకు సంబంధించిన అనేక నియమాలు మారబోతున్నాయి. క్రెడిట్ కార్డ్, LPG, UPI, CNG, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఈ మార్పులు మీ నెలవారీ ఖర్చులను పెంచుతాయి. మీరు మీ ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే ఈ నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. ఏ ప్రధాన మార్పులు అమలు అవుతున్నాయో తెలుసుకోండి.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్, సౌదీలో ఎంతో తెలుసా?
- యూపీఐలో కొత్త నియమాలు: మీరు Paytm, PhonePe, Google Pay వంటి UPI యాప్‌లను ఉపయోగిస్తుంటే, ఇప్పుడు కొన్ని కొత్త నియమాలు వర్తిస్తాయి. ఆగస్టు 1వ తేదీ నుండి మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. అలాగే ఫోన్ నంబర్ కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను 25 సార్లు మాత్రమే చెక్త చేయవచ్చు. ఆటో-పే వంటి సేవలకు సంబంధించిన లావాదేవీలు మూడు స్థిర స్లాట్‌లలో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఉదయం 10 గంటలకు ముందు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9:30 గంటల తర్వాత. విఫలమైన లావాదేవీల స్థితిని రోజుకు మూడు సార్లు మాత్రమే తనిఖీ చేయవచ్చు. రెండు సార్లు మధ్య 90 సెకన్ల గ్యాప్ అవసరం.
- LPG ధరలలో మార్పు: ఇక ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో కూడా మార్పు ఉండవచ్చు. గత నెలలో, వాణిజ్య సిలిండర్ల ధరను రూ. 60 తగ్గించారు. కానీ చాలా కాలంగా దేశీయ గ్యాస్ ధరలు మారలేదు. ఆగస్టు 1 నుండి దేశీయ గ్యాస్ చౌకగా మారుతుందని భావిస్తున్నారు. అయితే తుది నిర్ణయం చమురు కంపెనీలే తీసుకుంటాయి.
- క్రెడిట్ కార్డ్ బీమాలో కోత SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన మార్పు. ఆగస్టు 11 నుండి ఎస్‌బీఐ కొన్ని కో-బ్రాండెడ్ కార్డులపై (SBI-UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పీఎస్‌బీ, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటివి) అందించే ఉచిత విమాన ప్రమాద బీమా పాలసీని నిలిపివేస్తోంది. ఇప్పటివరకు ఈ కార్డులు రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు కవర్‌ను అందించేవి. ఇది ఇకపై అందుబాటులో ఉండదు. ఈ నిర్ణయం చాలా మంది కస్టమర్లను ప్రభావితం చేయవచ్చు.
- ఆగస్టులో బ్యాంకు సెలవులు: రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. ఆగస్టులో కూడా వివిధ రాష్ట్రాల పండుగలు, ముఖ్యమైన తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. అందుకే మీ ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయండి. ఎక్కువగా బ్యాంకింగ్ పనులు చేసుకునే వినియోగదారులు ఆగస్ట్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం
- CNG, PNG ధరలు: చమురు కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను మారుస్తాయి. అయితే ఏప్రిల్ 9 నుండి వాటి ధరలలో ఎటువంటి మార్పు లేదు. ముంబైలో సీఎన్‌జీ చివరి రేటు రూ. 79.50/kg, పీఎన్‌జీ, రూ.49/యూనిట్. కొత్త నెలలో వాటి ధరలు మారవచ్చు. ఇది ప్రజా రవాణా, గృహ ఖర్చులను ప్రభావితం చేయవచ్చు.
- విమానాలకు శక్తినిచ్చే ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు ఆగస్టు 1న సవరించనున్నారు. ధరలు పెరిగితే, విమానయాన సంస్థలు పెరిగిన ధరను ప్రయాణికులపై భారం పడవచ్చు. దీని వలన విమాన టిక్కెట్లు మరింత ఖరీదైనవిగా మారతాయి. ఆగస్టులో ప్రయాణించాలనుకునే వారు ఛార్జీలపై నిఘా ఉంచాలి. ఎందుకంటే ముందుగా బుక్ చేసుకోవడం చివరి నిమిషంలో ధరల పెరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!
ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి