గత కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాలు కార్లలో వాహన క్రాష్ పరీక్షలు, కొన్ని భద్రతా పరికరాలను ప్రామాణిక అమరికగా తప్పనిసరి చేయడం ద్వారా కఠినమైన రహదారి భద్రతా చట్టాలను అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలకు సంబంధించినంతవరకు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అందువల్ల దేశవ్యాప్తంగా కొత్త వాహన నమూనాలలో ముందస్తు రహదారి భద్రతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం భారత్ NCAP రూపంలో ఒక అత్యున్నత సంస్థను ఏర్పాటు చేసింది.
నేడు భారతీయ కస్టమర్లు కారు కొనుగోలు చేసేటప్పుడు భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2023లో ‘భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్’ (భారత్ NCAP)ని ప్రారంభించింది. ఇది గ్లోబల్ NCAP ప్రమాణాల ఆధారంగా నిర్వహించిన టెస్టింగ్. ఇది ఇప్పటివరకు 20 కార్ల భద్రతను పరీక్షించింది. భద్రత (AOP) స్కోరు ఆధారంగా ర్యాంక్ పొందిన భారత్.. NCAP పరీక్షించిన 5 సురక్షితమైన కార్ల జాబితాను తయారు చేసింది. పిల్లల భద్రత (COP)లో అన్ని కార్లు కూడా 45/49 మంచి స్కోర్‌ను సాధించాయి.
ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!
ఇవి కూడా చదవండి
మహీంద్రా థార్ రాక్స్ (AOP స్కోరు: 31.09/32):
నవంబర్ 2024లో జరిగిన భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా థార్ రాక్స్ 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ రేటింగ్ SUV అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. థార్ రాక్స్‌కు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ESC సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ADAS (కొన్ని టాప్ వేరియంట్‌లలో) వంటి మెరుగైన భద్రతా లక్షణాలు ఉన్నాయి. మహీంద్రా ఈ మోడల్‌ను ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో పాటు అధిక భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించి రూపొందించింది.
టాటా పంచ్ EV (AOP స్కోరు: 31.46/32):
టాటా మోటార్స్ పంచ్ EV మే 2024లో జరిగిన భారత్ NCAP పరీక్షలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, TPMSలను ప్రామాణిక లక్షణాలుగా కలిగి ఉంది.
మహీంద్రా BE 6 (AOP స్కోరు: 31.97/32):
జనవరి 2025లో జరిగిన భారత్ NCAP పరీక్షలో మహీంద్రా ఎలక్ట్రిక్ SUV BE 5 స్టార్ రేటింగ్ సాధించింది. BE 6 ‘ప్యాక్ త్రీ’ టాప్ వేరియంట్ పరీక్షించింది. కానీ ఈ రేటింగ్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగులు, రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, TPMS, డ్రైవర్ డ్రీటీ డిటెక్షన్ సిస్టమ్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి.
మహీంద్రా XEV 9e (AOP స్కోరు: 32/32):
జనవరి 2025లో జరిగిన భారత్ NCAP పరీక్షలో మహీంద్రా XEV 9e వయోజన ప్రయాణీకుల రక్షణ (AOP) కోసం 32/32 పాయింట్లను సాధించింది. ఈ కూపే-శైలి ఎలక్ట్రిక్ SUV దాని బేస్ వేరియంట్ ‘ప్యాక్ వన్’ నుండే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX మౌంట్‌లు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, TPMS వంటి లక్షణాలను అందిస్తుంది. XEV 9e బలమైన బాడీ నిర్మాణం, బలమైన భద్రతా లక్షణాలు దీనిని భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా చేస్తాయి.
టాటా హారియర్ EV (AOP స్కోరు: 32/32):
జూన్ 2025లో జరిగిన భారత్ NCAP పరీక్షలో టాటా హారియర్ EV వయోజన ప్రయాణికుల రక్షణ (AOP) పరంగా 32/32 పాయింట్లను సాధించింది. ఈ టాటా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV అన్ని వేరియంట్లలోని అన్ని సీట్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్, సౌదీలో ఎంతో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి