Pawan Kalyan Blankets For Tribal People: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులకు అండగా నిలిచారు. మక్కువ మండలంలోని ప్రజల అవసరాలు తెలుసుకొని 222 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. గతంలో డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామస్తులకు చెప్పులు, కురిడి గ్రామస్తులకు తన తోటలోని మామిడి పండ్లను పంపారు. గిరిజనుల పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానానికి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అవసరాలను తీర్చడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైలైట్:
- గిరిజనుల పట్ల పవన్ కళ్యాణ్ ప్రేమ
- మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు
- గిరిజనులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు

Pawan kalyan Slippers: ఆ ఊరికి చెప్పులు పంపిన పవన్ .. ఎందుకంటే?
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మారుమూల గిరిజన గ్రామాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడం, వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారి అవసరాలను గుర్తించి ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేయడం గిరిజనులను ఎంతో సంతోషపెడుతోంది. తమ గ్రామాన్ని గుర్తుపెట్టుకుని మరీ.. సొంత తోటలో పండిన మామిడి పండ్లను పంపించటం చూసి కురిడి గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. “పవన్ బాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలి” అంటూ ఈ సందర్భంగా గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తమ ఆశీస్సులను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత తోటలో పండించిన మామిడి పండ్లను ప్రత్యేకంగా తమ గ్రామానికి పంపించి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని కురిడి గ్రామస్తులు ఆనందంగా చెప్పారు.