మానవుల మధ్య బంధాలు అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలంగా ఉండాలన్నా, గౌరవ మర్యాదలతో సాగాలన్నా కొన్ని విషయాలు పాటించాలని.. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు తమని గౌరవించాలంటే.. కొన్నిసూత్రాలు పాటించాలని చాణిక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
పిల్లలు బాల్యం అపురూరం. వారు పెరిగే మొక్క లాంటివారు. అందుకే మన పెద్దలు మొక్కై వంగనిది మానై వంగుతుందా?”అని అంటారు. అంటే పిల్లలకు చిన్నప్పుడు నేర్పిన విద్య, అలవాటు పెద్దయ్యాక మారడం కష్టమని అంటారు.. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఏదైనా చేసే ముందు ఆలోచించాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఆచార్య చాణక్యుడు అలాంటి మూడు విషయాలను ప్రస్తావించాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు పొరపాటున ఏమేం చేయకూడదో చాణక్య నీతిలో ప్రస్తావించబడిన విషయాలు ఏమిటంటే..
చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అంతేకాదు తల్లిదండ్రులు తమ పిల్లల ముందు గొప్పలు చెప్పుకోవడం కూడా మానుకోవాలి. తల్లిదండ్రులు ఇలా చేస్తే. వారు తమ పిల్లలకు అబద్ధాలను చెప్పడం నేర్పిస్తున్నారు. అంతేకాదు అబద్దపు పరిస్థితుల్లో జీవించడం అలవాటు చేస్తున్నారు. కనుక తమ పిల్లలు నిజాయతీగా పెరగాలంటే.. వారి ముందు పొరపాటున కూడా తల్లిదండ్రులు అబద్దాలు చెప్పవద్దు.
చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎల్లప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లల మనస్సులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరితో ఒకరు గొడవలు పడడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అరచుకోవడం చేయవద్దు. ఇలాంటి తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడతారు. లేదా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అంతేకాదు పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తారు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం పిల్లల ముందు గొడవపడుతూ అసభ్యంగా మాట్లాడుతూ, బూతులు తిట్టడం వంటివి తల్లిదండ్రులు చేస్తే.. ఈ చెడు ప్రభావం పిల్లలపై చూపుతుంది. పిల్లల ముందు గొడవపడే తల్లిదండ్రులు తమ సొంత పిల్లల దృష్టిలో గౌరవాన్ని కోల్పోతారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల లోపాలను తెలుసుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఆ లోపాలను ఎత్తి చూఫై తద్వారా తన తల్లిదండ్రులను అవమానించడానికి వెనుకాడడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.