Vijayawada Haj Embarkation Point For 2026: ఆంధ్రప్రదేశ్ నుండి మక్కాకు వెళ్లే ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్‌గా గుర్తించింది. దీని ద్వారా యాత్రికులకు ప్రయాణ ఖర్చు, సమయం ఆదా అవుతాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రం నుంచే హజ్ యాత్ర ప్రారంభించవచ్చు.
హైలైట్:
- ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు వచ్చింది
- విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్
- ముస్లింలకు డబ్బుతో పాటూ సమయం ఆదా

ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోని యాత్రికులకు ప్రయాణ శ్రమ తగ్గుతుంది. భవిష్యత్తులో విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ వద్ద మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా కృషి చేస్తారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ కు, ముఖ్యంగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు.. సీఎం చంద్రబాబు ఫైర్
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలో ఈ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ ఉంటుంది.. ఈ పాయింట్లను కొన్ని విమానాశ్రయాలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ ఎంబార్క్ పాయింట్ల దగ్గర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అవసరమైన అన్ని లాంఛనాలు (వీసా, పాస్‌పోర్ట్, బ్యాగేజ్, సెక్యూరిటీ వంటి తనిఖీలు) పూర్తి చేస్తారు. హజ్ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఎంబార్కేషన్ పాయింట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి కేటాయించిన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్.