ఇన్కంటాక్స్ లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది బిక్షాటన అని సరదాగా కామెంట్ చేయడం వినే ఉంటారు. ముంబైకి చెందిన ఈ బిచ్చగాడు గురించి తెలిస్తే.. ఈ మాట నిజమేమో అని కూడా అంటారు. ఎందుకంటే భిక్షాటన చేస్తున్న భరత్ జైన్ అనే వ్యక్తి కోట్ల సంపదను సంపాదించాడు. ముంబైలో విలువైన ఆస్తులను కూడబెట్టాడు. అతని కథ సంకల్పం, తెలివైన పెట్టుబడులు ఆర్థిక విజయానికి ఎలా దారితీస్తాయో తెలియజేస్తుంది.
ముంబైలో కోటీశ్వరుడైన బిచ్చగాడి పేరు భరత్ జైన్. CST, ఆజాద్ మైదాన్ సమీపంలోని వీధుల్లో ప్లేట్ పట్టుకుని బిచ్చమేత్తుతాడు. భరత్ జైన్ గత 40 సంవత్సరాలుగా బిక్షాటన చేస్తూనే చేస్తున్నాడు. ఇదే అతని వృత్తి.. దినచర్య. ఇలా బిక్షాటన చేస్తూ అతను ఎంత సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
భరత్ జైన్ రోజుకు రూ. 2000-2500 సంపాదిస్తాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోజువారీ సంపాదన మరింత అధికంగా ఉంటుంది. ఇలా భరత్ బిక్షాటన చేసి నెలకు సుమారు దాదాపు రూ. 60,000 నుంచి రూ. 75,000 సంపాదిస్తాడు. అంటే ఇతని సంపాదన ముంబై సహా అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసే చాలామంది ఉద్యోగస్తుల నెలవారీ జీతం కంటే ఎక్కువ.
ఇవి కూడా చదవండి
భరత్ జైన్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల సంపాదన తక్కువ కావడంతో చదువుకునే అవకాశం కలగలేదు. దీంతో ముంబైలో భిక్షాటన చేయడం తన వృత్తిగా మార్చుకున్నాడు. తద్వారా తన విధిని తానే మార్చుకున్నాడు. ఇప్పుడు అనేక మంది ఉద్యోగస్థుల కంటే ఎక్కువ సంపాదించాడు.
తాను సంపాదించిన డబ్బులను ఖర్చు చేసే విధానానికి ఆర్ధిక సూత్రాన్ని అప్లై చేశాడు. తాను సంపాదించిన డబ్బులను వివిధ మార్గాల్లో పెట్టుబడిగా పెట్టాడు. జైన్ తన భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి, సోదరుడితో కలిసి ముంబైలోని రెండు ఫ్లాట్‌లలో నివసిస్తున్నాడు. వీటి విలువ మొత్తం రూ. 1.4 కోట్లు. అంతేకాదు భరత్ కు థానేలో రెండు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ. 30,000 అద్దె ఆదాయం వస్తుంది. ఈ ఆస్తులు అతని కుటుంబ అవసరాలను తీర్చుతున్నాయి. అంతేకాదు భరత్ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కూడా అందిస్తాయి.
జైన్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఫేమస్ సంస్థలో విద్యను పూర్తి చేసి.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి దిగాడు. భరత్ కుటుంబానికి ఒక స్టేషనరీ దుకాణం ఉంది. ఇది వారి ఆదాయాన్ని మరింత పెంచుతుంది.
ఆర్థికంగా స్థిరపడిన భరత్ భిక్షాటన చేయాలనే అతని నిర్ణయాన్ని కుటుంబం నిరసిస్తున్నా.. భరత్ తన కుటుంబ సభ్యుల నిరసనని లెక్క చేయడు. తాను ఇప్పటికీ బిక్షాటన ఆస్వాదిస్తున్నానని ఎటువంటి చట్టవిరుద్ధమైన పని చేయడం లేదని చెబుతాడు. భరత్ జైన్ తరచుగా దేవాలయాలకు వెళ్తాడు. అక్కడ డబ్బు విరాళంగా ఇస్తాడు.
మన దేశంలో భిక్షాటన ఒక వృత్తిగా మారిపోయింది. దీని విలువ రూ.1.5 లక్షల కోట్లుగా అంచనా వేశారు. భిక్షాటన ద్వారా రూ.1.5 కోట్ల నికర విలువ కలిగిన సంభాజీ కాలే, రూ.1 కోటి విలువ కలిగిన లక్ష్మీ దాస్ వంటి ఇతర బిచ్చగాళ్ళు కూడా బిక్షాటన చేస్తి కోట్ల రూపాయల సంపదను కూడబెట్టారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..