భారతదేశంలో మనం అనేక రకాల ఆహారాలు తింటాము. మన వంటగదిలో ఉండే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచుగా మనం వాటిని విస్మరిస్తాము. అలాంటి వాటిలో ఒకటి శనగలు. వీటిని చోలే అని కూడా పిలుస్తారు. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శనగలతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం వస్తే మంగళవారం రోజుల్లో ఈ శనగలను వాయినంగా ఇస్తారు. వీటిని ఉడకబెట్టుకుని, వేయించి, లేదా కూరగా చేసుకుని తింటారు. అయితే ఉడికించిన శనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోనలు ఎన్నో తెలుసా..
శనగలను ఉడికించి సలాడ్‌గా కూడా తినడానికి ఇష్టపడతారు. తేలికపాటి మసాలా దినుసులు జోడించి స్నాక్ గా తీసుకుంటున్నారు. శనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలంగా చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఏదైనా తినాలనుకుంటే శనగలు మంచి ఎంపిక అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉడకబెట్టిన శనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
రక్తపోటును నియంత్రణ
ఆహారంలో శనగలను చేర్చుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందులో బిపిని సాధారణంగా ఉంచడంలో ప్రభావవంతమైన అనేక లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి
బరువు తగ్గాలంటే
శనగాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు ఫైబర్ మంచి మూలం కూడా. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీని కారణంగా బరువు తగ్గడం సులభం అవుతుంది.
ఎముకలు, కండరాలు బలంగా
ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. ఎవరికైనా ఎముకలలో నొప్పి లేదా బలహీనత అనిపిస్తే ఉడికించిన శనగలను ప్రతిరోజూ తినడం వలన ఫలితం ఉంటుంది. అంతేకాదు శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే ఖచ్చితంగా తినే ఆహారంలోశనగలు చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యం కోసం
వారానికి మూడు రోజులు ఉడికించిన శనగలు తినడం మొదలు పెడితే… గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వాస్తవానికి శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా
శనగలలో విటమిన్లు సి, ఇ , కె పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగా ఉడికించిన శనగలు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అవి ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)