Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఈ ఆహారాలు అస్సలు ముట్టుకోవద్దు..!

1 August 2025

జామ వర్సెస్ అవాకాడో.. రెండింటిలో ఏది బెస్ట్..? ఆరోగ్యానికి ఏది మంచిది..?

1 August 2025

Telangana: శునకాల ఉద్యోగ విరమణ.. పోలీస్ జాగిలాలకి ఘనంగా వీడ్కోలు!

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Senior Citizen Card Apply Free,ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త.. ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి – andhra pradesh government provides senior citizen card service free of cost without paying any application fees
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Senior Citizen Card Apply Free,ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త.. ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి – andhra pradesh government provides senior citizen card service free of cost without paying any application fees

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Senior Citizen Card Apply Free,ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త.. ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి – andhra pradesh government provides senior citizen card service free of cost without paying any application fees
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Senior Citizen Card Apply: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి జారీ చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులకు సంబంధించి ఫీజు మినహాయించారు. ఇకపై ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఉచితంగానే కార్డుల్ని జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు ఈ విషయాన్ని గమనించి కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే పలువురు ఈ కార్డుల్ని తీసుకున్నారు.

హైలైట్:

  • ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపికబురు
  • సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితంగానే
  • ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం
ఏపీ సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితం
ఏపీ సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపికబురు చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు. గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం రూ.40 చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు.. కానీ ఇకపై ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్‌గా ఇస్తోంది. ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందడం సులువు అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా పొందవచ్చు. అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్‌తో పాటూ అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తారు.. ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఇస్తారు.

ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది, 15 నిమిషాల్లో ఇస్తారు. సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టికెట్‌లో 25 శాతం రాయితీ లభిస్తుంది. అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో రెండు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్‌ చేస్తారు. రైల్వే స్టేషన్‌లలో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు.. వీల్‌ఛైర్ల సదుపాయం, లోయర్ బెర్త్‌ల కేటాయింపులో ప్రాధాన్యత, రైలులలో ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు బెర్త్‌లు, థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్‌లు, సెకండ్ ఏసీలో మూడు బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌లకు (ఎవరు ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే వారికి) కేటాయిస్తారు.

వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు

సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి కొత్త పాస్‌పోర్టు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఫీజులో 10 శాతం తగ్గింపు ఉంది. అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టుల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కేటాయిస్తారు. బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ కౌంటర్ ఉంటుంది.. సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. 60-79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనంగా 0.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అదే 80 ఏళ్లుపైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఉపయోగలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు. అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ పన్ను విషయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి