గణనాథున్నే ఎత్తుకెళ్లారు దొంగలు. లంబదర అంటూ నిత్య పూజలు అందుకునే గణనాథుని విగ్రహాన్ని కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. డబ్బులు పెట్టి కొనుక్కొని 11 రోజులు పూజలు చేయాల్సి వస్తుంది అని.. అంత అవసరం తమకు లేదని అనుకున్నారో ఏమో కానీ.. వినాయక విగ్రహాలను తయారు చేసే షెడ్ నుంచి దర్జాగా వినాయకుణ్ణి ఆటోలో పెట్టుకొని ఎత్తుకెళ్లారు.
వినాయకా.! మొదటి పూజలు నీకెగదా మేము చేసేది. ఎత్తుకెళ్ళినా పూజలు చేసేది నీకే కదా అని అనుకున్నారామో దొంగలు దేశంలోనే మొదటి వినాయక విగ్రహం చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాలో విఘ్నేశ్వర స్వామి చోరీ స్థానికంగా అందరినీ బిత్తరపోయేలా చేసింది. ఇది నిజం.. ముహూర్తం పెట్టాలన్నా.. శుభకార్యాలు చేయాలన్నా.. సత్ఫలితాలు రావాలన్నా.. మొదటగా పూజించేది వినాయకుడినే. కానీ వినాయకుడిని దొంగలించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ సంఘటన మెదక్ జిల్లా టౌన్‌లోని ఓ వినాయకుల విగ్రహాల తయారీ స్టాల్‌లో జరిగింది. తెల్లవారుజామున మూడు గంటలకు జరిగినట్లు యజమాని సురేష్ తెలిపారు. స్టాల్ పక్కనే ఉన్న కారు షోరూమ్‌కి ఆనుకుని ఉన్న సీసీ కెమెరాలలో దొంగలించినదంతా రికార్డు అయింది. దీంతో షాప్ యజమాని ఈ ఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి