భారతీయ కరెన్సీ నోట్ల కాగితం కొంచెం భిన్నంగా ఉంటుందని మీరు గ్రహించి ఉంటారు. కానీ, అది కాగితం కాదని, అది వేరే విషయం అని మీకు తెలుసా.? అవును కరెన్సీ నోట్లు ఏ పదార్థాలతో తయారు చేస్తారో మీకు తెలుసా? మీరు అనుకున్నట్లుగా కరెన్సీ నోట్లు కాగితంతో తయారు చేయబడవు. అవును మన దేశంలో కరెన్సీ నోట్లు 100శాతం కాటన్ తో తయారు చేయబడతాయి. మన దేశంలోనే కాదు, చాలా దేశాలలో కరెన్సీ నోట్లను తయారు చేయడానికి పత్తిని ఉపయోగిస్తారు. కాగితం కంటే పత్తి బలంగా, మన్నికగా ఉంటుంది. అందుకే కరెన్సీ నోట్ల తయారీలో పత్తిని ఉపయోగిస్తారు.
భారతదేశంలో నోట్లు నాలుగు ప్రెస్‌లలో ముద్రించబడతాయి. వాటిలో రెండు భారత ప్రభుత్వం కింద, రెండు రిజర్వ్ బ్యాంక్ కింద పనిచేస్తున్నాయి. ఈ ముద్రణాలయాలు నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోనిలలో ఉన్నాయి. ఇక్కడ బ్యాంకు నోట్లను ముద్రిస్తారు.
ఇకమనం నాణేల గురించి మాట్లాడుకుంటే, అవి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాలుగు మింట్లలో తయారు చేయబడతాయి. ఈ మింట్‌లు ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలో ఉన్నాయి. ఈ నాణేలను రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 38 కింద జారీ చేస్తారు.
ఇవి కూడా చదవండి
నోటును మరింత మన్నికగా చేయడానికి, పత్తితో గాటిన్, అంటుకునే ద్రావణాలను ఉపయోగిస్తారు. చిరిగిన లేదా టేప్ చేయబడిన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవడానికి ఏ బ్యాంకు కూడా నిరాకరించకూడదు. బ్యాంకు ఉద్యోగులు నిరాకరిస్తే కస్టమర్లు ఆర్‌బిఐకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి