ఆగస్టు నెలలో గ్రహాల కదలికలో అనేక ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఈ గ్రహాల సంచారం జీవితంలోని వివిధ అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ఐదు ప్రధాన గ్రహాలు బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని, అంగారకుడు తమ రాశులను మార్చుకుంటాయి. ఈ గ్రహాలు తమ కదలికతో వాతావరణంలో సానుకూల శక్తితో నింపడమే కాదు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. వీరి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి.
ఆగస్టు 9న బుధుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 11 నుంచి ప్రత్యక్షంగా మారతాడు.. ఆగస్టు 30న సింహరాశిలోకి అతని సంచారము ప్రారంభమవుతుంది. దీనితో పాటు ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 21న శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు మీనంలో తిరోగమనంలో ఉంటాడు. కుజుడు కన్యారాశిలో ఉంటాడు. ఈ గ్రహాల మార్పుల కారణంగా ఐదు రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగనున్నాయి. వీరి జీవితాల్లో ఆనందం, విజయం, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.
మేష రాశి: వీరికి ఆగస్టు 2025 లో గ్రహాల సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. డబ్బులకు సంబందించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఇల్లు , వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లికి సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆస్తి సంబంధిత విషయాలలో లాభం ఉంటుంది. ఉద్యోగులు కెరీర్‌లో పురోగతికి అవకాశాలు పొందుతారు.
ఇవి కూడా చదవండి
మిథున రాశి: వీరికి ఈ నెలలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతాయి. స్నేహితులు, ప్రియమైనవారితో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తల్లిదండ్రులతో కలిసి బట్టలు , ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. వీరు ప్రసంగానికి సంబంధించిన పనిలో ప్రయోజనం పొందుతారు.
కన్య రాశి: కన్య రాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అదృష్టం వీరి సొంతం. ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు అందడంతో కొన్ని పనులు విజయవంతమవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరగవచ్చు. ఉద్యోగస్తులు తమ పనితో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది.
తుల రాశి: ఈ నెలలో తుల రాశి వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో వీరి ఖ్యాతి పెరుగుతుంది. వీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.
కుంభ రాశి: వీరికి అన్ని రకాల వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సానుకూల వాతావరణం లభిస్తుంది. ఆదాయం, సంపద పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. అన్ని అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. పిల్లలు, స్నేహితులకు సంబంధించిన విషయాలలో సంతోషంగా ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.