కింగ్‌డమ్ మూవీ నేడు థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ మలయాళ నటుడు వెంకటేష్ నటించారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జులై 31న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకుల దగ్గర నుంచి సినీసెలబ్రెటీలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.