టాలీవుడ్‌లో బాల నటీనటులుగా ఫిల్మ్ జర్నీ ప్రారంభించి.. తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా ఎదుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ వంటి వాళ్లు ఈ మార్పుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి చేరింది మరో పేరు విశికా కోటా. విశికా 2012లో వచ్చిన రామ్ చరణ్ నటించిన ‘రచ్చ’ సినిమాలో బాల నటిగా నటించింది. ఈ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? తమన్నా చిన్ననాటి పాత్ర! ఆ పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న విశికా, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగులు వేస్తోంది.
ఇప్పటికే ‘ఏందిరా ఈ పంచాయితీ’, ‘సగిలేటి కథ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విశికా, మరోవైపు కీలక పాత్రలతో కూడా తెరపై కనిపిస్తోంది. చిన్నతనంలో సినిమాల్లో నటించిన అనుభవం ఆమెకు ఇప్పుడు ఓ బలంగా మారింది. సన్ని డియోల్ నటించిన జాట్ అనే హిందీ సినిమాలోనూ మంచి పాత్ర పోషించింది. ఓదెల 2లోనూ విశికా కనిపించింది. ఓ ఇంటర్వ్యూలో విశికా మాట్లాడుతూ..“రచ్చ సినిమా టైమ్‌కి నేను చరణ్‌ను గానీ, తమన్నాను గానీ కలవలేను. వాళ్లు నా సీన్స్ షూట్ చేసే సమయంలో సెట్లో లేరు. అందుకే ఇప్పుడు వాళ్లు నన్ను చూస్తే.. గుర్తుపట్టే ఛాన్స్ కూడా ఉండదు” అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
1998 జూలై 19న హైదరాబాద్‌లో జన్మించిన విశికా, చదువు పూర్తి చేసిన తర్వాత నటన పట్ల ఆసక్తి పెరిగి ఫుల్‌టైమ్‌గా సినిమాల్లోకి వచ్చిందట. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు స్కోప్ ఉన్న రోల్స్‌కి మొదటి ప్రాధాన్యం ఇస్తోంది. అయితే స్క్రీన్‌పై ఎంత బాగా కనిపించినా… సోషల్ మీడియా మీద మాత్రం మరింత స్టైలిష్‌గా, హాట్‌గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. తరచూ గ్లామర్ ఫొటోషూట్లు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఈ తెలుగు అమ్మాయికి టాలెంట్ ఉన్నదని, మంచి అవకాశాలు రావాలని నెటిజన్లు కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.