Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Dharmasthala Case: ధర్మస్థల నరమేధం.. తవ్వకాల్లో బయటపడుతోన్న ఉలిక్కిపడే నిజాలు..

1 August 2025

AP Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏం ఉండాలి.? ఏం ఉండకూడదు.? వివరాలివిగో

1 August 2025

Hyderabad: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nandamuri Balakrishna,సైకిల్‌పై బాలయ్య సందడి.. పార్లమెంట్ ఆవరణలో హిందూపురం ఎమ్మెల్యే! – hindupur mla nandamuri balakrishna meet central minister at delhi parliament bhavan
ఆంధ్రప్రదేశ్

Nandamuri Balakrishna,సైకిల్‌పై బాలయ్య సందడి.. పార్లమెంట్ ఆవరణలో హిందూపురం ఎమ్మెల్యే! – hindupur mla nandamuri balakrishna meet central minister at delhi parliament bhavan

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nandamuri Balakrishna,సైకిల్‌పై బాలయ్య సందడి.. పార్లమెంట్ ఆవరణలో హిందూపురం ఎమ్మెల్యే! – hindupur mla nandamuri balakrishna meet central minister at delhi parliament bhavan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో సైకిల్‌పై విహరిస్తూ కనిపించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్ లాల్ ఖట్టర్‌లను కలిసి హిందూపురం అభివృద్ధికి విజ్ఞప్తులు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పేరుతో జరుగుతున్న మోసపూరిత విరాళాల సేకరణపై ఆయన స్పందించారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హైలైట్:

  • ఢిల్లీలోని పార్లమెంట్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ
  • కేంద్ర మంత్రులను కలిసి హిందూపురం ఎమ్మెల్యే
  • టీడీపీ ఎంపీపై సైకిల్‌పై కూర్చున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా ఆయన స్టయిలే వేరు.. ఆయన రూటే సపరేటు. ఢిల్లీకి వెళ్లిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పార్లమెంట్ ఆవరణలో కాసేపు సందడి చేశాడు. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనం ఆవరణలో కాసేపు సైకిల్‌పై కూర్చొని సందడి చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను నందమూరి బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి పలు వినతులు సమర్పించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలతో కూడా ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.
కేంద్ర మంత్రులను కలిసే ముందు పార్లమెంట్ ఆవరణలో ఉన్న నందమూరి బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సైకిల్ చూయించారు. పార్లమెంట్ సమావేశాలకు తాను రోజూ ఇదే సైకిల్‌పై వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. దాంతో తమ పార్టీ సింబల్ అయిన సైకిల్‌పై బాలయ్య సరదాగా కూర్చొని ఫొటోకి పోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. 2014లో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన బాలయ్య.. 2019, 2024లో అక్కడ నుంచి గెలిచారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. హిందూపురాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరిన బాలయ్య.. ఇప్పుడు కేంద్రమంత్రులను కలిసి నిధులు విడుదల చేయాలని విన్నవించారు.

తాజాగా బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్ పేరుతో తనకు తెలియకుండానే విరాళాలు సేకరించబోతున్నారనే సమాచారం రావడంతో నందమూరి బాలకృష్ణ స్పందించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉన్న ఆయన ఈ ఈవెంట్‌కు ఎలాంటి అధికారిక అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. అశ్విన్ అట్లూరి పేరిట వచ్చిన మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు.

మహేష్ గోనె

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వర రావు (మహేష్ గోనె) తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. ఆయనకు జర్నలిజంలో 11 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఇతర మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలతోపాటు పాలిటిక్స్, సోర్ట్స్‌కు సంబంధించిన వార్తలు రాశారు. ఆయన ఎస్ఎస్‌జే నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు.… ఇంకా చదవండి