మేక వన్నె పులిలా.. పోలీస్ డ్రెస్ వెనక ఉన్న ఓ క్రూర మృగ నేర చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మస్ట్ వాచ్ డార్క్ షేడ్ థ్రిల్లర్‌గా నెట్‌ప్లిక్స్‌లో ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. Indian Predator: Beast of Bangalore. ఇది డాక్యుమెంటరీ సిరీస్ కాదు. యథార్థ కథ. కళ్లెదురుగా జరిగిన క్రైమ్‌ల వెనుక దాగిన మానవ మృగం కథ. ఇది ఉమేష్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ. బయటికి పోలీస్ యూనిఫాంలో ఉన్న ఈ వ్యక్తి… రాత్రి వేళ సీరియల్ కిల్లర్ అవతారం ఎత్తుతాడు. న్యాయాన్ని రక్షించాల్సిన వాడే.. క్రూరుడుగా మారి అత్యాచారాలు, హత్యలు చేశాడు. బెంగళూరులో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలోకి చొరబడి అత్యాచారం చేసి .. అతి క్రూరంగా హత్యలు చేస్తుంటాడు. వాళ్ల ఇన్నర్స్‌ని కలెక్ట్ చేసుకుని దాచుకుంటూ ఉంటాడు. ఇలా మొత్తం 18 మంది మహిళలు ఈ సైకో పోలీస్ అఘాయిత్యానికి బలి అయ్యారు. గుండె వణికిపోయేలా ఉండే ఈ డాక్యుమెంటరీ.. మేకింగ్‌లో రియాలిటీ ఉట్టిపడేలా ఉంటుంది. ఫ్యాక్ట్స్, ఇన్వెస్టిగేషన్, బాధితుల కథలు అన్నీ చాలా ఇంటెన్స్‌గా చూపించారు మేకర్స్. మనసు కదిలించే సీన్స్‌కి కొదవ లేదు. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, వయలెన్స్, ఇన్సెన్సిటివ్ డీటెయిల్స్ ఉండటం వల్ల, ఫ్యామిలీతో చూడటాన్ని స్కిప్ చేస్తేనే మంచిది. కానీ ఎవరైతే క్రైమ్ స్టోరీలు వాస్తవికంగా చూడాలనుకుంటున్నారో… ఇది తప్పక చూడాల్సిన కంటెంట్. Beast of Bangalore – ఇది ఫిక్షన్ కాదు.. రియాలిటీ. ఓ పోలీస్ యూనిఫామ్ వెనక దాగిన పిశాచం మానసిక స్థితిని బయటపెట్టిన బోల్డ్ నెరేటివ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??
Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే