కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ల కోసం కౌంటర్ వద్ద ప్రయాణీకులు వరుసలో వేచి ఉన్నా పట్టించుకోకుండా ఓ క్లర్క్ చాలా నిర్లక్ష్యంగా ఫోన్‌లో ముచ్చట్లు పెట్టాడు. అతన్ని నిర్లక్ష్యపు వైఖరిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది.
ప్రయాణికులు తమ ట్రైన్ వెళ్లిపోతుందేమో కొంచెం టిక్కెట్లు ఇవ్వండి అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అతను ఫోన్‌లో తన సంభాషణను కొనసాగిస్తూ ప్రయాణికులను పట్టించుకోలేదు. అతని తీరుతో విసిగిపోయిన ఓ ప్రయాణికుడు టిక్కెట్లు ఇవ్వండి అని కాస్త గట్టిగా అడిగే సరికి.. ఒక్క నిమిషం అంటూ బదులిచ్చాడు.. ఒక్క నిమిషం కాదు మేం లైన్లో నిల్చోని 15 నిమిషాలు అయిందని అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తరువాత గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం, సిబ్బందిని సస్పెండ్ చేశాం, సిబ్బందిపై ప్రధాన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం అని రైల్వే అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు.
ಈ ಹಿಂದಿಗನ ದುರಹಂಕಾರ ನೋಡಿ..
ಕರ್ನಾಟಕದ ಯಾದಗಿರಿ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ನಡೆದಿರೋ ಘಟನೆ…
ಕೂಡಲೇ ಈತನನ್ನು ಕೆಲಸದಿಂದ ವಜಾ ಮಾಡಿ..@VSOMANNA_BJP @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/DFbcJCijgz— ರೂಪೇಶ್ ರಾಜಣ್ಣ(RUPESH RAJANNA) (@rajanna_rupesh) July 29, 2025
Inconvenience caused is deeply regretted, staff has been suspended and major disciplinary proceedings have been initiated against the staff.
— Sr DCM – Guntakal (@Srdcmgtl) July 30, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి