రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించిన తర్వాత ఇరింజలకుడ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు రాబోయే ఆరు నెలల పాటు వారి పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుండి గరిష్టంగా రూ.10,000 వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. రుణాలు జారీ చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా కూడా నిషేధం ఉంది. జూలై 30న జారీ చేసిన సర్క్యులర్‌లో RBI కొత్త ఆంక్షలను ప్రకటించింది. బ్యాంకు డబ్బు తీసుకోవడం, బదిలీ చేయడం లేదా దాని ఆస్తులను విక్రయించకుండా కూడా పరిమితులు విధించింది. అయితే రుణగ్రహీతలు డిపాజిట్లపై రుణాలను సెట్ చేయడానికి అనుమతించినట్లు సర్క్యులర్ పేర్కొంది. ఈ పరిమితులు జూలై 30 నుండి ఆరు నెలల వరకు అమలులో ఉంటాయి.
జీతాలు, అద్దె, విద్యుత్ ఛార్జీలు వంటి ముఖ్యమైన ఖర్చులకు మాత్రమే బ్యాంకు డబ్బు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. ఇటీవల కాలంలో బ్యాంకు పనితీరును మెరుగుపరచడం కోసం ఆర్‌బిఐ బోర్డు, సీనియర్ మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపులు జరిపింది. అయితే పర్యవేక్షణ సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకు తీసుకున్న కచ్చితమైన ప్రయత్నాలు లేకపోవడం, అలాగే కనీస నియంత్రణ మూలధనాన్ని నిర్వహించడానికి మూలధన నిధులను ఇన్ఫ్యూజ్ చేయకపోవడం వల్ల బ్యాంకు డిపాజిటర్ల ఆసక్తిని కాపాడటానికి ఈ ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆర్‌బిఐ సర్క్యులర్ పేర్కొంది.
బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఆంక్షల కింద పనిచేయడానికి అనుమతి ఉంటుంది. పరిస్థితిని ఆర్‌బిఐ నిశితంగా పరిశీలిస్తుంది, అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే బ్యాంకు లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్‌బిఐ తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ సర్క్యలర్ వెలువడగానే పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వారి డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని వారు అభ్యర్థించినప్పటికీ RBI ఆదేశం ప్రకారం ఒక వ్యక్తికి రూ.10,000 మాత్రమే ఇస్తామని బ్యాంకు అధికారులు వారికి తెలియజేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి